రిజర్వేషన్ కోసం త్యాగాలకు సిద్ధం
కర్నూలు(అర్బన్): రిజర్వేషన్ సాధన కోసం ఎలాంటి త్యాగాలు చేసేందుకై నా వెనుకాడబోమని బేడ బుడగ జంగం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తూర్పాటి మనోహర్ అన్నారు. కర్నూలులోని హార్ట్ ఫౌండేషన్ భవనంలో ఆదివారం బేడ బుడగ జంగాల యువత సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ.. దశాబ్దాలుగా బేడ బుడగ జంగాల తల రాతలు మాత్రం మారడం లేదన్నారు. రిజర్వేషన్ సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. ప్రస్తుత వేసవి కాల బడ్జెట్ సమావేశాల్లోనే రాష్ట్ర ప్రభుత్వం పంపించిన నివేదికకు పార్లమెంట్‌లో చట్టబద్ధత కల్పించాలన్నారు. లేని పక్షంలో విజయవాడలో యువత ఆధ్వర్యంలో భారీ కా ర్యక్రమాన్ని చేపడతామన్నారు. సమావేశంలో భార్గవ్, డీటీఎఫ్ నాయకులు రత్నం ఏసేపు, రాయలసీమ విద్యా వంతుల వేదిక నాయకులు భా స్కర్‌రెడ్డి, చిన్న రాముడు, జిల్లాలోని పలు మండలాల నుంచి వచ్చిన యువకులు పాల్గొన్నారు.


