సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలి
ఎమ్మిగనూరురూరల్: ఖరీఫ్ సీజన్‌లో రైతులు పంటల సాగులో సమగ్ర సస్యరక్షణ చర్యలు, యాజమాన్య పద్ధతులు పాటించాలని కేవీకే ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ డాక్టర్ రాఘవేంద్రచౌదరి, ఏడీఏ మహమ్మద్‌ఖాద్రి సూచించారు. శుక్రవారం మండల పరిఽధిలోని బనవాసి కృషి విజ్ఞాన కేంద్రంలో ఖరీఫ్ పంటల సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఖరీఫ్‌లో కంది, పత్తి, ఆముదం, వేరుశనగ, వరి, కొర్ర పంటల సాగులో రైతులు సస్యరక్షణ పద్ధతులు పాటించి అధిక దిగుబడులు సాధించాలన్నారు. వేసవిలో లోతు దుక్కులు దున్నుకోవాలని, భూసార పరీక్షలు చేయించుకుని ఫలితాలకు అనుగుణంగా ఎరువులు, పంటలు వేసుకోవాలని సూచించారు.
కూలిన ట్యాంకుపై విచారణ
మంత్రాలయం: మండల కేంద్రంలో 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఓహెచ్‌ఆర్ ట్యాంకు నేలమట్టమైన విషయం విధితమే. ఈ ఘటనపై శుక్రవారం ఆర్‌డబ్ల్యూఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ హరేరామ్ నాయక్, క్వాలిటీ కంట్రోల్ నిపుణులు సత్యనారాయణ విచారణ చేపట్టారు. మంత్రాలయంలోని రాఘవేంద్రపురంలో కుప్పకూలిన ట్యాంకును పరిశీలించి నమూనా లు సేకరించారు. రూ.6 కోట్ల నిధులతో గురురాఘవేంద్రప్రాజెక్టు కాంట్రాక్టర్ యువరాజ్ పనులు చేపట్టారు. రూ.25 లక్షల వ్యయంతో ఓహెచ్‌ఆర్ ట్యాంకు నిర్మాణం గా వించారు. 2017లో ట్యాంకు నిర్మాణం చేపట్టగా ఇప్పటి వరకు నీటి సరఫరా చేయలేదు. ఇటీవల తాగునీటిని ట్యాంకులో నింపగా బరువుకు కుప్పకూలింది. ట్యాంకు కూలడంతో సీఈ విచారణ చేపట్టారు. నాణ్యత లోపం అని తేలితే కాంట్రాక్టర్ నుంచి రూ.25 లక్షలు తిరిగి వసూలు చేస్తామన్నారు. ఆయనతోపాటు ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ పద్మజ, డీ ఈఈ మొయినుద్దీన్, ఏఈ వెంకట్రాముడు, గ్రామ సర్పంచు తెల్లబండ్ల భీమయ్య ఉన్నారు.
కోలుకోలేక వ్యక్తి మృతి
మహానంది: మిద్దైపె నుంచి పడి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి కోలేకోలేక గురువారం మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. చిన్న కంబలూరు గ్రామానికి చెందిన కొమ్ము సర్వయ్య(41) మహానంది మండలం గోపవరం గ్రామానికి చెందిన ఎస్తేరాణిని వివాహం చేసుకున్నాడు. అత్తమామలను చూసేందుకు గోపవరానికి వచ్చిన అతడు.. గత నెల 29న ఈదురుగాలులతో కూడిన వర్షానికి మిద్దైపెన ఉన్న వరిగడ్డి కట్టలు తడిచిపోతాయేమోనని పట్టలు కప్పేందుకు వెళ్లి ప్రమాదవశాత్తూ కిందపడ్డాడు. బలమైన గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం నంద్యాలకు, అక్కడి నుంచి కర్నూలుకు తరలించారు. కోలుకోలేక మృతిచెందినట్లు ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలి
సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలి


