
ఏపీఎస్పీ బెటాలియన్‌లో రేంజ్–2 స్పోర్ట్స్ మీట్ ప్రారం
కర్నూలు : రాష్ట్ర విభజన తర్వాత కర్నూలు ఏపీఎస్పీ రెండవ బెటాలియన్‌లో రేంజ్–2 స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్– 2025 మొదటిసారిగా ప్రారంభమైంది. బెటాలియన్ కమాండెంట్ దీపిక పాటిల్ ముఖ్య అతిథిగా హాజరై పరేడ్ గ్రౌండ్‌లో క్రీడాపోటీలను ప్రారంభించారు. ఈనెల 25వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. కర్నూలుతో పాటు కడప, అనంతపురం, చిత్తూరుతో పాటు స్పెషల్ ఆర్మ్‌డ్ రిజర్వ్ ఆఫ్ సెంట్రల్ పోలీస్ లైన్, అంబర్‌పేట, హైదరాబాదు (ఎస్‌ఏఆర్‌సీపీఎల్) బెటాలియన్స్‌కు చెందిన పోలీసు క్రీడాకారులు స్పోర్ట్స్ మీట్‌లో పాల్గొన్నారు. బుధవారం ప్రారంభ రోజు జావెలిన్ త్రో, లాంగ్‌జంప్, 800 మీటర్ల పరుగు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజయం సాధించిన వివిధ పటాలాలకు చెందిన క్రీడాకారులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు కమాండెంట్ అందజేశారు. జావెలిన్ త్రోలో 11వ బెటాలియన్‌కు చెందిన పీసీ యు.ప్రదీప్ కుమార్ మొదటి బహుమతి కై వసం చేసుకోగా 9వ బెటాలియన్‌కు చెందిన పీసీ గోపీనాథ్ రెండో బహుమతి, 11వ బెటాలియన్‌కు చెందిన నరసింహ మూడో బహుమతి దక్కించుకున్నారు. లాంగ్‌జంప్‌లో 11వ బెటాలియన్ పీసీ ప్రదీప్ కుమార్ మొదటి బహుమతి, రిజర్వు ఇన్‌స్పెక్టర్ కె.రామకృష్ణ రెండో బహుమతి, ఎస్‌ఏఆర్‌సీపీఎల్ యూనిట్ పీసీ వెంకటేశ్వర్లు మూడో బహుమతి గెలుచుకున్నారు. అలాగే 800 మీటర్ల పరుగుపందెంలో రెండో బెటాలియన్ పీసీ నరేంద్ర మొదటి బహుమతి, 9వ బెటాలియన్ పీసీ వెంకయ్య రెండో బహుమతి, పీసీ అశోక్ మూడో బహుమతి సాధించారు. కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ నాగేంద్ర రావు, అసిస్టెంట్ కమాండెంట్లు మహబూబ్ బాషా, రవికిరణ్, వెంకటరమణ, సుధాకర్‌రెడ్డి, రిజర్వు ఇన్‌స్పెక్టర్లు, రిజర్వు సబ్ ఇన్‌స్పెక్టర్లు, మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.
రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారి జరుగుతున్న క్రీడాపోటీలు