
అదుపుతప్పితే.. కడుపుకోతే!
మండలంలోని నంచర్ల గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థుల ప్రాణాలకు భరోసా లేకుండాపోతోంది. నీటి కుళాయిలు మరమ్మతులకు నోచుకోక మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులు సంపు పైకెక్కి నీరు తోడుకుంటున్నారు. ఈ సంపు సుమారు పది అడుగుల లోతు ఉంది. సంపు ఇనుప మూత పాడవడంతో మరమ్మతులు చేయించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు ప్రమాదకర పరిస్థితుల్లో నీరు తీసుకుంటున్నారు. జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. – చిప్పగిరి
సంపు పైకెక్కి నీరు తోడుకుంటున్న విద్యార్థులు

అదుపుతప్పితే.. కడుపుకోతే!