
కొత్త అంశాలు తెలుసుకుంటున్నా
గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణా శిబిరంలో పాల్గొంటున్నాను. చిత్రలేఖనం, పుస్తక పఠనం, పేపర్ ఆర్ట్ నేర్పిస్తున్నారు. స్కూల్ ఫ్రెండ్స్‌తో పాటు సమ్మర్ క్యాంప్ ఫ్రెండ్స్ పెరిగారు. సెలవులు వృథా కాకుండా కొత్త అంశాల్లో శిక్షణ ఇవ్వడం సంతోషకరం.
– బిల్విక, 7వ తరగతి విద్యార్థిని
సరదాగా గడిచిపోతోంది
సమ్మర్ క్యాంప్ సరదాగా గడిచిపోతోంది. సెలవుల్లో నిర్వహిస్తున్న క్యాంప్‌కు హాజరు కావడంతో అనేక కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం. జాతీయ నాయకుల జీవిత చరిత్రలను కథల రూపంలో చెబుతున్నారు. ఆటపాటలతో ఆనందంగా గడుపుతున్నాం. కొత్త ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు.
– హర్షిత్, 6వ తరగతి విద్యార్థి
ఉత్సాహంగా
పాల్గొంటున్నారు
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని గ్రంథాలయ శాఖల్లో వేసవి విజ్ఞాన శిబిరాలు కొనసాగుతున్నాయి. విద్యార్థులు ఉత్సాహంగా క్యాంప్‌లో పాల్గొంటున్నారు. వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఇవి ఉపయుక్తంగా నిలుస్తున్నాయి. ప్రత్యేక నిపుణులు పలు అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం క్యాంప్ జరుగుతోంది. అధిక సంఖ్యలో విద్యార్థులు క్యాంప్‌కు వచ్చి సద్వినియోగం చేసుకుంటున్నారు. పిల్లలు తమ ప్రజ్ఞాపాఠవాలను పెంపొందించుకునేందుకు ఈ శిబిరాలు ఉపయోగపడుతున్నాయి.
– కె.ప్రకాష్, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి

కొత్త అంశాలు తెలుసుకుంటున్నా

కొత్త అంశాలు తెలుసుకుంటున్నా
Comments
Please login to add a commentAdd a comment