అదును దాటి.. ఆశలు ఎండి | - | Sakshi
Sakshi News home page

అదును దాటి.. ఆశలు ఎండి

Sep 21 2026 6:59 AM | Updated on Sep 21 2026 6:59 AM

సాగు చేసిన రైతుల్లోనూ నిరాశే..

అవనిగడ్డ: కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో 87,785 ఎకరాల్లో వరిసాగు భూములున్నాయి. ఏటా ఆగస్టు నెల ఆఖరికి నాట్లు పూర్తయ్యేవి. ఈ ఏడాది సెప్టెంబర్‌ 20 దాటినా.. కేవలం 57,375 ఎకరాల్లో మాత్రమే నాట్లు వేశారు. ఇంకా 30,410 ఎకరాల్లో వరినాట్లు వేయలేదు. వీటిలో నాట్లు వేసే పరిస్థితి కనబడటం లేదు.

అదును దాటిపోయింది..

దివిసీమలోని రైతులు రెండో పంటయిన అపరాల (మినుము, పెసర, మొక్కజొన్న) సాగుపై ఎక్కువ ఆధార పడతారు. రెండో పంట ద్వారానే రైతులకు కొంత ఆదాయం మిగులుతుంది. కౌలు రైతులు ఈ పంటను దృష్టిలో పెట్టుకునే పొలాలు సాగు చేస్తుంటారు. ఆగస్టు నెలాఖరుకు నాట్లు పడితే రెండో పంట మినుము దిగుబడులు వస్తాయి. లేదంటే మినుము పంట పూత, కాయకు వచ్చే సమయానికి మంచు ఎక్కువ పట్టడం వల్ల మినుము దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అందుకే ఆలస్యంగా సాగుచేసే కంటే ఈ పంటకు విరామం ఇచ్చి రెండో పంట అయిన మినుము ద్వారా ఆదాయం వస్తుందని రైతుల నమ్మకం అందుకే ఇప్పటి వరకూ సాగుచేయని పొలాల్లో సాగుచేసేందుకు రైతులు ఇష్టపడటం లేదు. దీంతో 30వేల ఎకరాల్లో నాట్లుకు విరామం ఇచ్చినట్టే.

పంటకాలువ ద్వారా వచ్చే నీటితో సాగు చేసిన రైతుల్లోనూ తీవ్ర నిరాశే ఉంది. ఆయిల్‌ ఇంజిన్లు లేకుండా సాగుచేసే పరిస్థితి లేదు. కాలువ నుంచి వచ్చే సాగునీటిని ప్రతిరోజూ ఆయిల్‌ ఇంజిన్‌ ద్వారానే పెట్టుకుంటున్నారు. దీనివల్ల ఎకరాకు నీరు తోడాలంటే పదిరోజులకు ఏడు నుంచి పది లీటర్లు ఆయిల్‌ ఖర్చు అవుతోంది. అంటే ఎకరాకు ఏడు వందల నుంచి రూ.1,100 వరకూ ఖర్చవుతోంది. ఉదయం తోడితే సాయంత్రానికి నీరుండటం లేదని.. ఆయిల్‌ కోసమే ఇప్పటి వరకూ ఎకరాకు పదివేలకు పైగా ఖర్చులు అయ్యాయని కొంతమంది రైతులు వాపోతున్నారు. అంటే పంట చేతికి రావాలంటే ఆయిల్‌ ఖర్చులే రూ.20వేల వరకూ అవుతాయని పిట్టల్లంకకు చెందిన రావి సుబ్బారావు అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు.

పంటను వదిలేసుకుంటున్న అన్నదాతలు

అవనిగడ్డ నియోజకవర్గంలో

30వేల ఎకరాల్లో పడని నాట్లు

అదును తప్పడంతో వరిసాగుకు విరామం

పంటకాలువలకు అందని సాగునీరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement