పవర్‌ లిఫ్టింగ్‌లో రాణిస్తున్న నితిన్‌ కుమార్‌ | - | Sakshi
Sakshi News home page

పవర్‌ లిఫ్టింగ్‌లో రాణిస్తున్న నితిన్‌ కుమార్‌

Jun 10 2026 1:19 AM | Updated on Jun 10 2026 1:19 AM

మచిలీపట్నంటౌన్‌: నగరానికి చెందిన కె. నితిన్‌ కుమార్‌ పవర్‌ లిఫ్టింగ్‌లో ప్రత్యేక ప్రతిభను కనబరుస్తున్నాడు. స్థానిక దేశాయిపేటకు చెందిన ఈ యువకుడు 17 ఏళ్ల వయసులోనే జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు పతకాలను సాధించి పలువురి ప్రశంసలు అందుకున్నాడు. ఇటీవల జరిగిన పలు పోటీల్లో పాల్గొని బంగారంతో పాటు పలు పతకా లను సాధించాడు. స్థానిక సెయింట్‌ ఫ్రాన్సిస్‌ ఇంగ్లిష్‌ మీడియం హైస్కూల్‌లో నితిన్‌కుమార్‌ 12వ తరగతి చదువుతున్నాడు. గత ఏప్రిల్‌ నెల 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు రాజస్థాన్లోని ఉదయపూర్‌లో జరిగిన జాతీయస్థాయి పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో 93 కిలోల సబ్‌ జూనియర్‌ క్యాటగిరీ పోటీల్లో పాల్గొని టాప్‌ పోర్‌ విత్‌ 327.5 కిలోల బరువును ఎత్తాడు. ఫిబ్రవరి 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కర్నూల్‌లోని డీఎస్‌ఏ అవుట్‌ డోర్‌ స్టేడియంలో జరిగిన పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో 295 కిలోల బరువు ఎత్తి వెండి, రజిత పతకాలను సాధించాడు. ఫిబ్రవరి 8వ తేదీన గుడివాడలో పవర్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ కృష్ణాజిల్లా ఆధ్వర్యంలో జరిగిన సెకండ్‌ కృష్ణ, ఎన్టీఆర్‌ జిల్లాల జిల్లా స్థాయి పవర్‌ లిప్టింగ్‌ చాంపియన్‌ షిప్‌ 2025– 26 పోటీల్లో పాల్గొని సబ్‌ జూనియర్‌ 93 కిలోల విభాగంలో 250 కిలోల బరువును ఎత్తి బంగారు పతకాన్ని కై వసం చేసుకున్నాడు. అండర్‌ –20 వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో పాల్గొని 94 కిలోల భాగంలో బంగారు పతకాన్ని సాధించాడు. ఏ ప్రాంతంలో జరిగిన పోటీల్లోనైనా పాల్గొని పతకాలు సాధిస్తున్న యువ క్రీడాకారుడు నితిన్‌ కుమార్‌ను నగరానికి చెందిన పలువురు ప్రముఖులు, క్రీడాభిమానులు అభినందిస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని పతకాలను సాధించి మచిలీపట్నానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని వారు ఆకాంక్షిస్తున్నారు.

జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు

17 ఏళ్ల వయసులోనే క్రీడా నైపుణ్యం

Advertisement
 
Advertisement
Advertisement