గ్యాస్‌, పెట్రో ధరలను తక్షణమే రద్దు చేయాలి | - | Sakshi
Sakshi News home page

గ్యాస్‌, పెట్రో ధరలను తక్షణమే రద్దు చేయాలి

Jun 10 2026 1:19 AM | Updated on Jun 10 2026 1:19 AM

గ్యాస్‌, పెట్రో ధరలను తక్షణమే రద్దు చేయాలి

కృష్ణలంక(విజయవాడతూర్పు): డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు, పన్నులు పెంచి ప్రజలను పీక్కుతింటున్నాయని వామపక్ష పార్టీల నాయకులు విమర్శించారు. పెంచిన గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కృష్ణలంక జాతీయ రహదారిపై నేతాజీ వంతెన వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో మంగళవారం పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ రేట్లు పెంపుదలకు నిరసనగా రాస్తారోకో జరిగింది. పెద్ద సంఖ్యలో కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తలు హైవేపై బైఠాయించారు. ప్లకార్డులు ప్రదర్శించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు, ధరల భారాలకు నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హైవేపై అరగంట పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

ధరలు పెంచడంలో రికార్డులు బ్రేక్‌..

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, సీపీఎ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు, ఇతర వామపక్షాల నేతలు మాట్లాడుతూ.. 12 సంవత్సరాలు పాలించి మోదీ రికార్డు బ్రేక్‌ చేయడం కాదు, పన్నులు, ధరలు పెంచడంలో రికార్డులు బద్దలు కొట్టారని విమర్శించారు. పెట్రోలియం ఉత్పత్తులపై 12 ఏళ్లలో రూ.40 లక్షల కోట్లు పన్నులు వసూలు చేసిన పాపం కేంద్ర ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. పశ్చిమాసియా యుద్ధాన్ని బూచిగా చూపి చమురు రేట్లు పెంచడం దుర్మార్గమన్నారు. రష్యా, ఇరాన్‌ నుంచి చౌకగా చమురు లభిస్తున్నా అధిక రేట్లకు అమెరికా చెప్పిన విధంగా కొనుగోలు చేసి దేశ ప్రజలపై భారం మోపటం గర్హనీయమన్నారు. ఎన్నికలకు ముందు అదనపు పన్నులు తగ్గిస్తామని మాట ఇచ్చిన చంద్రబాబు కూటమి మోసం చేసిందని దుయ్యబట్టారు. ఏ రాష్ట్రంలో లేనంత ఎక్కువగా పెట్రోల్‌పై 35 శాతం, డీజిల్‌పై 27శాతం పన్నులు వసూలు చేయటం అమానుషమన్నారు. వామపక్ష పార్టీల నాయకులు హరినాథ్‌, వెంకటేశ్వర్లు, అమర్నాథ్‌, డి.కాశీనాథ్‌, జి.కోటేశ్వరరావు, ప్రసాద్‌ బాబు పాల్గొన్నారు.

రాస్తారోకోలో వామపక్ష పార్టీల నాయకులు

Advertisement
 
Advertisement
Advertisement