వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లాలో ఉపాధ్యాయులకు నిర్వహించిన పునాది అభ్యాసన, సంఖ్యాత్మకత శిక్షణ శిబిరం మంగళవారంతో ముగిసింది. జిల్లాలో ఒకటో తరగతి బోధించే 854 మంది ఉపాధ్యాయులకు ఏడు ప్రదేశాల్లో ఈ శిక్షణ శిబిరాన్ని వారం రోజులుగా నిర్వహించారు. విజయవాడలోని పడమట, గొల్లపూడి, మైలవరం, విస్సన్నపేట, తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేటలలో ఈ శిక్షణ కార్యక్రమం జరిగింది. ప్రతి మండలానికి ముగ్గురు చొప్పున 20 మండలాలకుగాను 60 మంది రిసోర్స్ పర్సన్స్‌ను ఎంపిక చేశామని అధికారులు తెలిపారు. వారు వారివారి ప్రదేశాల్లో ఈ శిక్షణ నిర్వహిస్తారని వివరించారు. ప్రధానంగా విద్యార్థులకు బోధనలతో, నూతన పాఠ్యపుస్తకాలకు సంబంధించిన అంశాలను, సామర్థ్యాలకు సంబంధించిన ఉపాధ్యాయులకు నేర్పి తద్వారా పాఠశాలలో అమలు చేస్తారన్నారు. జిల్లా అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఆర్. రమేష్‌బాబు, జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్. చంద్రకళ, స్టేట్ అబ్జర్వర్ సీహెచ్ వెంకటరమణ, స్టేట్ ఎఫ్‌ఎల్‌ఎన్ కోఆర్డినేటర్లు ప్రతిష్ట కుసుమాలు పాల్గొన్నారు.


