మచిలీపట్నంటౌన్: ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ కృష్ణా జిల్లా కార్యవర్గం ఏకగ్రీ వంగా ఎన్నికై ంది. నోబుల్ కళాశాల ఆడిటోరియంలో శుక్రవారం రాత్రి జరిగిన ఎన్నికల కార్యక్రమంలో కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ సంఘ జిల్లా చైర్మన్‌గా పువ్వుల కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా చాట్ల మేరీ రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ హాజరైన ఆ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బగ్గా జగదీష్, అసోసియేట్ చైర్మన్ పిల్లి హరీశ్ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో జేఏసీని మరింత బలోపేతం చేస్తామన్నారు. ఉద్యోగులకు ఇప్పటికే రావాల్సిన స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్లు, అసంబద్ధమైన హేతుబద్ధీకరణ ప్రక్రియ, తాత్కాలిక డెప్యుటేషన్ల రద్దుతో పాటు ఇతర ఆర్థిక, ఆర్థికేతర సమస్యలపై రానున్న కాలంలో వివిధ శాఖల సంఘాల నాయకులతో చర్చించి త్వరలోనే ఒక బలమైన ఉద్యమ కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ఆ సంఘ రాష్ట్ర కమిటీ కో–చైర్మన్లు చేవూరి వెంకటేశ్వర్లు, బెక్కం రవితేజ, గంటా రామకృష్ణతో పాటు నూతనంగా ఎన్నికై న జిల్లా కార్యవర్గ సభ్యులు బి.సుకుమార్, కృష్ణ చైతన్య, రాజు, క్రాంతి, హనుమంతరావు, విశ్వ, రామకష్ణ, హేమలత, లక్ష్మీ నారాయణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


