ఆగని ఇసుక తవ్వకాలు | - | Sakshi
Sakshi News home page

ఆగని ఇసుక తవ్వకాలు

Jun 7 2026 9:30 AM | Updated on Jun 7 2026 9:30 AM

ఆగని ఇసుక తవ్వకాలు ● గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలు బేఖాతర్‌ ● లంకపల్లి క్వారీలో తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత

● గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలు బేఖాతర్‌ ● లంకపల్లి క్వారీలో తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత

పమిడిముక్కల: దోచుకొనేవాడికి దోచుకున్నంత.. తవ్వుకొనేవారికి తవ్వుకొన్నంత ఇసుక అన్న చందంగా ఉంది మండలంలోని లంకపల్లి క్వారీలో ఇసుక పరిస్థితి. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ మార్గదర్శకాల ప్రకారం జూన్‌ 1 నుంచి అక్టోబర్‌ 15 వరకు నదిలో ఇసుక తవ్వకాలు చేపట్టరాదు. ఈ నిబంధనలు ఉల్లంఘించి ఇసుక తవ్వకాలు జరిపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ కూడా ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ లంకపల్లిలో అనుమతులు లేకుండా క్వారీలు నడుస్తున్నాయి. అధికారిక క్వారీలో టిప్పర్లు, అనధికారిక క్వారీలో ట్రాక్టర్లతో యథేచ్ఛగా ఇసుక రవాణా సాగుతోంది. అనధికారిక క్వారీలో పాక వేసుకొని ట్రాకర్టకు సీరియల్‌ ఇచ్చి బాట చార్జీలు ప్రైవేటు వ్యక్తులు వసూలు చేస్తున్నారు. ట్రాక్టర్లలో ఇసుకను బయటకు తరలించి సొమ్ము చేసుకొంటున్నారు. నదిలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నా అధికారులు అటు వైపు కన్నెత్తి చూడటం లేదు.

Advertisement
 
Advertisement
Advertisement