జిప్సం జగడం! | - | Sakshi
Sakshi News home page

జిప్సం జగడం!

Jun 6 2026 1:53 AM | Updated on Jun 6 2026 1:53 AM

నయవంచనపై బిగిసిన పిడికిళ్లు వైరల్‌ అవుతున్న ఆడియో ప్రకారం..

రెండో రోజు కొనసాగిన విచారణ..

అలవిగాని హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు ప్రభుత్వం.. వాటిని అమలు చేయడంలో ఘోరంగా విఫలమైంది. ఫలితంగా రెండేళ్లలోనే జనాగ్రహాన్ని చవిచూస్తోంది. కూటమి అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో వైఎస్సార్‌ సీపీ పిలుపునిచ్చిన ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమంలో ప్రజానీకం స్వచ్ఛందంగా తరలివచ్చి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు. శుక్రవారం విజయవాడ సెంట్రల్‌, నందిగామ, తిరువూరు నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించి, చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన బాండ్ల ప్రతులను దహనం చేశారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మొండితోక జగన్‌మోహనరావు, నల్లగట్ల స్వామిదాసు, వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. – సాక్షి నెట్‌వర్క్‌
నయవంచనపై బిగిసిన పిడికిళ్లు

కోడూరు: మండలంలోని వి.కొత్తపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్‌)లో వివాదాస్పదంగా మారిన జిప్సం నిల్వల వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తాజాగా సంఘ చైర్‌పర్సన్‌, జనసేన నేత రేపల్లె పిచ్చేశ్వరరావు, సీఈఓ తోట శ్రీకాంత్‌ మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణ ఆడియో బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఆడియోలో జిప్సం అక్రమాలపై చైర్‌పర్సన్‌ మాట్లాడిన తీరు, అధికారులను బెదిరించే ధోరణి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

● ‘జిప్సాన్ని నాగాయలంక మండలం వాళ్లకు ఇచ్చేసి మనం చేతులు దులిపేసుకుందాం’ అంటూ చైర్‌పర్సన్‌ సీఈఓకు సూచించినట్లు వినిపిస్తోంది. అయితే దీనికి సీఈఓ శ్రీకాంత్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ‘ఈ విషయంలో మీరు పక్కకు తప్పుకుంటున్నారు.. ఎవరొచ్చినా నన్నే అడుగుతున్నారు’ అన్నట్లుగా ఆడియోలో ఉంది.

● కోడూరు కేడీసీసీ బ్యాంక్‌ సూపర్‌వైజర్‌ ఫణీంద్రబాబు విచారణకు వచ్చిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ.. ‘విచారణకు వచ్చిన సమయంలో పీఏసీఎస్‌లో ఉండే సూపర్‌వైజర్‌ను బీపీలో కొట్టేవాడిని’ అంటూ చైర్‌పర్సన్‌, జనసేన నేత రేపల్లె పిచ్చేశ్వరరావు తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు వినిపిస్తోంది. ఈ వ్యాఖ్యలు అధికార వర్గాల్లోనూ కలకలం రేపుతున్నాయి.

● ‘నాగాయలంక వాళ్లు జిప్సం ఎత్తుకుపోయారని చెబుదాం.. నీకెందుకు?’ అంటూ సీఈఓకు చైర్‌పర్సన్‌ చెప్పగా.. దీనికి సీఈఓ స్పందిస్తూ ‘ఈలోపు ఎవరైనా వస్తే సమాధానం ఏమి చెప్పాలి’ అన్ని ప్రశ్నించారు. ‘అదంతా ఆర్బీకే వాళ్లు చూసుకుంటారు.. నీకేందుకు?’ అంటూ చైర్‌ పర్సన్‌ దురుసుగా మాట్లాడారు.

● అలాగే జిప్సం సరఫరాకు సంబంధించిన ఓఫామ్‌, ఇన్‌వాయిస్‌, రవాణా బిల్లుల గురించి సీఈఓ ప్రశ్నించగా, ‘నువ్వు పుస్తకంలో నేను చెప్పింది రాయి’ అంటూ ఒత్తిడి తీసుకొచ్చినట్లు ఆడియోలో వినిపిస్తోంది. ‘నువ్వు అల్లరి చేయకుండా కూర్చుంటే ఏమీ ఉండదు.. నువ్వే అల్లరి చేస్తున్నావు’ అంటూ సీఈవోను హెచ్చరించిన మాటలు కూడా చర్చనీయాంశమయ్యాయి.

● కాగా నామినేటెడ్‌ పోస్టులో చైర్‌పర్సన్‌ హోదా దక్కించుకొని అధికారులపై తీవ్రంగా దుర్భాషలాడిన జనసేన పిచ్చేశ్వరరావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సహకార ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు.

చైర్‌పర్సన్‌–సంఘ సీఈఓ

మధ్య ఫోన్‌ సంభాషణ కలకలం

వి.కొత్తపాలెం పీఏసీఎస్‌

అక్రమాలపై కొత్త అనుమానాలు

జిప్సం వ్యవహారంపై విచారణ రెండో రోజైన శుక్రవారం కూడా కొనసాగింది. అవనిగడ్డ సబ్‌ డివిజన్‌ కోఆపరేటివ్‌ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ డి. నాగమల్లేశ్వరరావు విచారణ అధికారిగా వ్యవహరించారు. సంఘ సీఈఓ తోట శ్రీకాంత్‌ నుంచి వివరాలు సేకరించారు. రికార్డులు పరిశీలించి, జిప్సం నిల్వలు, పత్రికల్లో వచ్చిన కథనాలపై ఆరా తీశారు. విచారణ అనంతరం నివేదికను డీసీసీబీ అధికారులతో పాటు జిల్లా కలెక్టర్‌కు కూడా నివేదించనున్నట్లు నాగమల్లేశ్వరరావు తెలిపారు. కేడీసీసీబీ కోడూరు శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement