పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

Jun 6 2026 1:53 AM | Updated on Jun 6 2026 1:53 AM

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత కోనేరుసెంటర్‌: రాబోయే తరాలకు సురక్షితమైన భవిష్యత్తును అందించాలంటే ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎకై ్సజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం మంగినపూడి బీచ్‌లో నిర్వహించిన స్వచ్ఛత కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, జాయింట్‌ కలెక్టర్‌ ఎం. నవీన్‌, ఇతర అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి అధికారులతో కలిసి బీచ్‌ ప్రాంగణంలో పేరుకుపోయిన ప్లాస్టిక్‌ వ్యర్థాలు, చెత్తాచెదారాన్ని తొలగించి శుభ్రం చేశారు. విద్యార్థులు, స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొని పరిసరాలను పరిశుభ్రం చేశారు. అనంతరం మంత్రి అందరి చేత పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించారు. జనసేన ఇన్‌చార్జ్‌, జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ చైర్మన్‌ బండి రామకృష్ణ, మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కుంచె దుర్గాప్రసాద్‌ (నాని), రాష్ట్ర మైనారిటీ డైరెక్టర్‌ హసీం బేగ్‌, బందరు ఆర్డీఓ కే సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

మొక్క నాటిన హోమంత్రి..

ఆటోనగర్‌(విజయవాడతూర్పు): స్థానిక అగ్నిమాపక కేంద్రం ఆవరణలో హోం మంత్రి వి. అనిత మొక్క నాటారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా స్థానిక నోవోటెల్‌ హోటల్‌ నుంచి ఆటోనగర్‌ ఫైర్‌ స్టేషన్‌ వరకు నిర్వహించిన సైకిల్‌ ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఫైర్‌ స్టేషన్‌ను పరిశీలించారు. అత్యవసర సేవల వివరాలను ఇక్కడి అధికారి జీవీ రామారావుతో పాటు పలువురిని ఆమె అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అగ్నిమాపక సర్వీసెస్‌ డైరెక్టర్‌ జనరల్‌ పి. వెంకటరమణ, అడిషినల్‌ డైరెక్టర్‌ జి. శ్రీనివాసులు, జిల్లా అధికారి ఏవీ శంకర్రావు పాల్గొన్నారు.

రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర

Advertisement
 
Advertisement
Advertisement