రెండేళ్ల అరాచక పాలనపై ప్రజానీకం కన్నెర్ర | - | Sakshi
Sakshi News home page

రెండేళ్ల అరాచక పాలనపై ప్రజానీకం కన్నెర్ర

Jun 5 2026 10:09 AM | Updated on Jun 5 2026 10:09 AM

రెండేళ్ల అరాచక పాలనపై ప్రజానీకం కన్నెర్ర

వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిరసనలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ ఆగ్రహం చంద్రబాబు, పవన్‌ సంతకాలతో ఇచ్చిన బాండ్ల ప్రతులు దహనం ఇప్పటికై నా బుద్ధి తెచ్చుకోవాలంటూ నినాదాలు

పామర్రు నియోజకవర్గ పరిధిలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కై లే అనిల్‌కుమార్‌ ఆదేశాల మేరకు పామర్రులోని స్థానిక పార్టీ కార్యాలయం నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. తోట్లవల్లూరు మండల కేంద్రంతో పాటు మొవ్వ మండలం కూచిపూడి గ్రామంలో, పమిడిముక్కల మండలం వీరంకిలాకు, పెదపారుపూడిలోని మహానేత వైఎస్సార్‌ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించి అనంతరం మేనిఫెస్టో, బాండ్లను దహనం చేశారు. ఆయా మండలాలకు చెందిన పార్టీ నాయకులు పాల్గొన్నారు.

అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ సింహాద్రి రమేష్‌బాబు నేతృత్వంలో వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమాన్ని నిర్వహించారు. అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, చల్లపల్లి, మోపిదేవి, ఘంటసాల మండల కేంద్రాల్లో నిరసన తెలిపారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ సింహాద్రి రమేష్‌బాబు అవనిగడ్డలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయా మండలాలకు చెందిన వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మచిలీపట్నం నియోజకవర్గంలో పార్టీ ఇన్‌చార్జ్‌ పేర్ని కృష్ణమూర్తి(కిట్టు) ఆధ్వర్యంలో నగరంలోని ఇనుగుదురుపేట ఎంఆర్‌ ఫంక్షన్‌ హాలు వద్ద వైఎస్సార్‌ సీపీ నాయకలు, కార్యకర్తలు నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అనంతరం టీడీపీ మేనిఫెస్టో, హామీ బాండ్ల ప్రతులను దహనం చేశారు. ఆయా కార్యక్రమాల్లో మచిలీపట్నం పార్లమెంట్‌ పరిశీలకులు జెట్టి గురునాథం, నియోజకవర్గ పరిశీలకులు మాదు శివరామకృష్ణ, వరికూటి అశోక్‌బాబులతో పాటు నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పెడన నియోజకవర్గంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఉప్పాల రాము నేతృత్వంలో పెడన నగరంలోని పార్టీ కార్యాలయం నుంచి మెయిన్‌రోడ్డు వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం వద్ద మెయిన్‌రోడ్డుపై మేనిఫెస్టో, బాండ్లను తగలబెట్టారు. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక, జోన్‌–3 ఇన్‌చార్జ్‌ వరికూటి అశోక్‌బాబు తదితరులు పాల్గొన్నారు. కృత్తివెన్ను మండలం యండపల్లి గ్రామంలో హామీలపై వాగ్దానం చేసిన ప్రతులను దహనం చేశారు. వైఎస్సార్‌ సీపీ నాయకులు పిన్నింటి మహేష్‌, జల్లా భూపతి, మైలా రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. గూడూరు మండలం మెయిన్‌ రోడ్డు వైఎస్సార్‌ సీపీ జెండా స్థూపం వద్ద పార్టీ మండలాధ్యక్షుడు సమ్మెట జయవర్ధన్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మండల ఎంపీపీ సంగా మధుసూదనరావు, జెడ్పీటీసీ వేముల సురేష్‌ రంగబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి గొరిపర్తి రవికుమార్‌, జిల్లా వైఎస్సార్‌ సీపీ సెక్రటరీ పిండి వెంకన్న బాబు పాల్గొన్నారు.

పెనమలూరు నియోజకవర్గంలో వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమాన్ని ఉయ్యూరు పట్టణంలో గురువారం నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ దేవభక్తుని చక్రవర్తి ఆధ్వర్యంలో పట్టణంలో టీడీపీ మేనిపెస్టో, హామీ బాండ్లను నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జంపాన కొండలరావు, ఉయ్యూరు మండల పార్టీ అధ్యక్షుడు దాచే రవి, పట్టణ అధ్యక్షులు అబుల్‌కలాం, ఎంపీపీ చీలి కల్పన పాల్గొన్నారు.

గన్నవరం నియోజకవర్గంలో ఇన్‌చార్జ్‌ వల్లభనేని వంశీమోహన్‌ ఆదేశాల మేరకు గన్నవరంలో జెడ్పీటీసీ సభ్యురాలు అన్నవరపు ఎలిజిబెత్‌రాణి, మహిళా నాయకులు టీడీపీ మేనిఫెస్టో, హామీ బాండ్లను దగ్ధం చేశారు. అనంతరం నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.

గుడివాడ నియోజకవర్గంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కొడాలి శ్రీవేంకటేశ్వరరావు (నాని) ఆదేశాల మేరకు గుడివాడ మండలం మోటూరు గ్రామం, గుడ్లవల్లేరు మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద, నందివాడ మండలంలోని జనార్దనపురం గ్రామంతో పాటు గుడివాడ పట్టణంలోని మెయిన్‌రోడ్డులో ఉన్న జ్యోతిరావుపూలే విగ్రహం వద్ద వైఎస్సార్‌ సీపీ నాయకులు నిరసన తెలిపారు. అనంతరం టీడీపీ మేనిఫెస్టో, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ బాండ్లను దహనం చేశారు.

దహనమవుతున్న బాండ్ల ప్రతులు

చిలకలపూడి(మచిలీపట్నం): సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రజలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను చంద్రబాబు ప్రభుత్వం గాలికొదిలేసింది. తాము అధికారంలోకి వస్తే సూపర్‌–6 పేరుతో మేనిఫెస్టోను రూపొందించి హామీలన్నీ తప్పక అమలు చేస్తానని చెప్పి రాష్ట్ర ప్రజలను మోసం చేసింది. దీంతో ప్రజలకు ఇచ్చిన హామీలు కచ్చితంగా అమలు చేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రజల తరఫున పోరుబాట పట్టింది. ఇందులో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కావస్తున్నా నేపథ్యంలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో ప్రజల తరఫున పోరాటం చేసేందుకు సన్నద్ధమైంది. దీనిలో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేయాలని వైఎస్సార్‌ సీపీ డిమాండ్‌ చేస్తోంది. ఇందుకోసం ఆయా నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో ఎన్నికల సమయంలో చంద్ర బాబు ఇచ్చిన మేనిఫెస్టో, ఎన్నికల సమయంలో ఇచ్చిన బాండ్లను దహనం చేసి నిరసన తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement