వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలో భాషల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ, న్యాయ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూఖ్ అన్నారు. ఏపీ ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆవో ఉర్దూ సీఖే’ సమ్మర్ క్యాంప్‌లో పాల్గొని కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రదానోత్సవం బుధవారం వన్‌టౌన్‌లోని ముసాఫిర్ ఖానాలో జరిగింది. ముఖ్యఅతిథి ఎన్‌ఎండీ ఫరూఖ్ మాట్లాడుతూ.. ఉర్దూ భాష నేర్చుకునే విద్యార్థులకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తోందన్నారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ మహమ్మద్ ఫరూఖ్ షుబ్లీ మాట్లాడుతూ.. ఉర్దూ భాష దేశ సాంస్కృతిక వారస త్వంలో కీలక భాగమన్నారు. యువతలో ఉర్దూ భాషపై ఆసక్తి పెంచుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా ‘ఆవో ఉర్దూ సీఖే’ కార్యక్రమాన్ని విజయవం తంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు టి.డి. జనార్దన్, మైనారిటీ వ్యవహారాల సలహాదారు అహ్మద్ షరీఫ్ ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. ఉర్దూ అకాడమీ డైరెక్టర్ షేక్ మొహమ్మద్ గౌస్ పీర్, వైస్ చైర్మన్ పఠాన్ ఖాదర్ ఖాన్, బోర్డు సభ్యుడు మెహబూబ్ బాషా, సూఫీ మత గురువు అల్తాఫ్ బాబా తదితరులు ప్రసంగించారు.
మంత్రి ఎస్‌ఎండీ ఫరూఖ్


