నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు | - | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

Jun 2 2026 5:59 AM | Updated on Jun 2 2026 5:59 AM

నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

‘మీ కోసం’ లో కలెక్టర్‌ డీకే బాలాజీ ప్రజల నుంచి 138 అర్జీలు స్వీకరణ

చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ప్రభుత్వ భవన నిర్మాణాలను పూర్తి చేసేందుకు ప్రతిపాదనలు పంపాలని గతంలో తాను చెప్పినప్పటికీ ఇంత వరకు ఏ ఒక్క అధికారి పంపలేదని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ డీకే బాలాజీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు డెప్యూటీ కలెక్టర్‌ బి. నారాయణ, డీఎస్పీ జి. శ్రీనివాసరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ అనంతరం జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ప్రభుత్వ భవనాల నిర్మాణానికి కావాల్సిన నిధుల వివరాలకు సంబంధించిన నివేదికలు సమర్పించాలని చెప్పినప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా అంగన్‌వాడీ భవన నిర్మాణాలకు సంబంధించి ఇచ్చిన నివేదికలు అసంపూర్తిగా ఉన్నాయని ఇలా అయితే చర్యలు తీసుకుంటామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాసమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యమని ప్రతి అర్జీపై ప్రత్యేక దృష్టి సారించి సకాలంలో పరిష్కారం చూపాలని కలెక్టర్‌ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా యంత్రాంగంపై నమ్మకంతో అర్జీలు సమర్పిస్తున్నారని ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవటం ప్రతి అధికారి బాధ్యతన్నారు. అర్జీల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం, జాప్యం చోటు చేసుకోకుండా చూడాలన్నారు. మీకోసంలో అధికారులు 138 అర్జీలను స్వీకరించారు.

వచ్చిన అర్జీల్లో కొన్ని..

● తనకు నలుగురు ఆడపిల్లలు ఉన్నారని.. పిల్లలకు పుట్టిన తేదీ ధ్రువపత్రాలు, ఆధార్‌కార్డులు లేవని, దీని వల్ల వారు చదువులు, సంక్షేమ పథ కాలు పొందేందుకు ఇబ్బందులు పడుతున్నా రని తమపై దయ ఉంచి వాటిని మంజూరు చేయాలని మచిలీపట్నం నగరంలోని 50వ డివిజన్‌కు చెందిన టి. నాంచారమ్మ కలెక్టర్‌కు విన్నవించుకున్నారు.

● తనకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారని కుమారుడికి వచ్చిన వ్యాధికి వైద్యం చేయించే స్తోమత లేక భర్త పురుగుమందు తాగి చనిపోయాడని, ప్రస్తుతం ఆడపిల్లలకు ప్రమాదవశాత్తూ కన్ను పోయిందని, ఈ వైద్య ఖర్చుల కోసం ఆర్థికసాయం చేయాలని, అంతేకాకుండా ఒంటరి మహిళ పింఛన్‌, ఇళ్ల స్థలం మంజూరు చేయాలని గుడివాడ పట్టణంలోని 1వ వార్డుకు చెందిన గుడుమూరి శ్రీదేవి అర్జీ ఇచ్చారు.

● తన కుమారుడు గోగులమూడి విజయ్‌ కుమార్‌ 90 శాతం అంగవైకల్యం ఉందని.. ప్రస్తుతం వస్తున్న రూ.6 వేలు పింఛన్‌కు బదులుగా రూ.15 మంజూరు చేసి ఆదుకోవాలని, వీల్‌ చైర్‌ మంజూరు చేయాలని గుడివాడ మండలం మోటూరుకు చెందిన జి. మరియమ్మ అర్జీ ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement