మచిలీపట్నం నియోజకవర్గం సమన్వయకర్త పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) మాట్లాడుతూ లేని ఉద్యోగాలు ఇచ్చినట్లు, లేని కంపెనీలు తెచ్చినట్లు ప్రచారం చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందన్నారు. మెగా డీఎస్సీని గొప్పగా ప్రచారం చేస్తూ.. వాస్తవంలో అభ్యర్థుల మెరిట్ దోపిడీకి పాల్పడిందని విమర్శించారు. అన్ని శాఖల మంత్రి నారా లోకేష్‌కు క్యాష్ తప్ప ఇంకేమీ పట్టడం లేదని విమర్శించారు. అధికారం వచ్చిందని ఏదైనా చేయవచ్చని అనుకుంటే అది భ్రమేనని హెచ్చరించారు. గతంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో లక్షల వలంటీర్, సచివాలయ ఉద్యోగాలు పారదర్శకంగా ఇచ్చామని గుర్తు చేశారు. విద్యాశాఖ ఉద్యోగాల్లో కొనుగోలు – అమ్మకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మెరిట్ లిస్టు ప్రదర్శించాలంటూ కోర్టు ఆదేశాలు ఉన్నా వాటిని కూడా పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.


