ధూమపానం చేసేవారిలో మందులు పనిచేయని పరిస్థితి ఉంటుంది. తీవ్రమైన శ్వాసకోశ వ్యాధుల భారిన పడుతుంటారు. కొందరు ధూమపానం మానేందుకు ఈ– సిగరెట్‌తాగుతున్నారు. అది కూడా హానికరమే. దానిలో కూడా నికోటిన్ ఉండటంతో శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. సిగరెట్ తాగేవ్యక్తి వదిలిన పొగ పీల్చిన వారికి (సెకండ్ హ్యాండ్ స్మోక్) గది, కారు వంటి వాటిలో స్మోకింగ్ చేసినప్పుడు ఆ పొగ గోడలకు పట్టి , ఆ తర్వాత అక్కడకు వచ్చిన వారికి(థర్డ్ హ్యాండ్ స్మోక్) వ్యాధులు సోకుతున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా భారత్‌లోనే పొగాకు ఉత్పత్తులు వాడుతున్నారు. క్యాన్సర్ బాధితుల్లో 27 శాతం మందికి పొగాకుఉత్పత్తులే కారణం. అంతేకాదు మధుమేహం, రక్తపోటు ఉన్న వారు ధూమపానం చేస్తే మందులు వాడినా అదుపులోకి రావడం కష్టంగా మారతుంది.
–ఎస్.వి.శివప్రసాద్‌రెడ్డి, ఇంటర్వెన్షనల్ పల్మొనాలజిస్ట్, సెంటినీసిటి


