సాగరతీరం అల్లకల్లోలం | - | Sakshi
Sakshi News home page

సాగరతీరం అల్లకల్లోలం

May 31 2026 1:12 AM | Updated on May 31 2026 1:12 AM

సాగరతీరం అల్లకల్లోలం

తీరం గేట్లను మూసివేసిన

అటవీ అధికారులు

కోడూరు: హంసలదీవి సాగరతీరం అల్లకల్లోలంగా మారింది. వాతావరణ మార్పులతో రెండు రోజులుగా అలల ఉధృతి ఎక్కువగానే ఉంది. శనివారం మరింత అధికమైంది. సముద్ర అలలు సుమారు మూడు మీటర్ల ఎత్తున ఎగసిపడుతున్నాయి. సముద్రం నీరు ముందుకు చొచ్చుకువచ్చి డాల్ఫిన్‌ భవనం చుట్టూ చేరాయి. తీరంలోని ఇసుకతిన్నెలు సైతం భారీగా కోతకు గురయ్యాయి. పౌర్ణమి ఘడియలు కావడంతో సముద్రుడి భీకర హోరుతో తీరప్రాంతం ప్రతిధ్వనిస్తోంది. ఈ నేపథ్యంలో అటవీ అధికారులు తీరం గేట్లను మూసివేశారు. పాలకాయతిప్ప కరకట్ట వద్దే పర్యాటకుల రాకపోకలను నిషేధించారు. సముద్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు గేట్లు మూసే ఉంటాయని అటవీ రేంజర్‌ ఎస్‌వీకే కుమార్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement