న్యూస్‌రీల్
డీఎస్సీలో భారీ స్కాం
నిరుద్యోగుల జీవితాలతో ఆటలా..
పరీక్ష రాసేవాడికే నిర్వహణ బాధ్యతలా?
దుర్గమ్మ సేవలో..
కేంద్ర మంత్రికి ఘనస్వాగతం
సీపీని కలిసిన డీఎస్పీలు
కృష్ణాజిల్లా
శనివారం శ్రీ 30 శ్రీ మే శ్రీ 2026
నిరుద్యోగులకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, లోకేష్
● డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో
విచారణ చేయించే దమ్ముందా?
● మోసాలపై వైఎస్సార్ సీపీ నేతలు
అవినాష్, వెలంపల్లి, విష్ణు ఆగ్రహం
● లోకేష్‌ను తక్షణం మంత్రి పదవి
నుంచి తొలగించాలని డిమాండ్
● డీఎస్సీలో అవకతవకలపై వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన
భవానీపురం(విజయవాడపశ్చిమ): మెగా డీఎస్సీ అంటూ నిరుద్యోగులను నిలువునా మోసం చేశా రని, ఒక్కొక్క పోస్టును రూ.లక్షలకు అమ్ముకున్నా రని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. డీఎస్సీ పరీక్షల నిర్వహణ, మెరిట్ లిస్ట్ దాపరికం, స్పోర్ట్స్ కోటా నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించే దమ్ము ఉందా అని చంద్రబాబు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. వివిధ అంశాలపై శ్వేత పత్రాలు విడుదల చేశామని చెబుతున్న చంద్ర బాబు ప్రభుత్వం డీఎస్సీపై అదే పని చేసే ధైర్యం ఉందా అంటూ నిలదీశారు. డీఎస్సీ పోస్టులను రూ.లక్షలకు విక్రయించి నిరుద్యోగులకు వెన్నుపోటు పొడిచిన సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ మోసం, వంచనకు కేరాఫ్ అడ్రస్సని మండిపడ్డారు. డీఎస్సీలో అనేక అవకతవకలకు పాల్పడటం ద్వారా విద్యా వ్యవస్థను దిగజార్చిన లోకేష్‌ను తక్షణమే మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ–2025లో చోటు చేసుకున్న అక్రమాలు, అవినీతికి వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి కళా క్షేత్రం ఎదురుగాగల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద శుక్రవారం నిరసన కార్యక్రమం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున హాజ రైన డీఎస్సీ అభ్యర్థులు, విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన చంద్రబాబు, నారా లోకేష్ డౌన్ డౌన్ అంటూ నినదించారు.
వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. డీఎస్సీలో పోస్టులను రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షలకు విక్రయించా రని విమర్శించారు. కూటమి అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలను ఇస్తామని హామీ ఇచ్చి ఉపాధ్యాయ పోస్టులను విక్రయించి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న ఏకైక ప్రభుత్వం చంద్రబాబు సర్కారేనని పేర్కొన్నారు. మహానాడులో ఆత్మ స్తుతి, పర నింద తప్ప చెప్పుకొనేందుకు చేసిన ఒక్క మంచి పనీ లేదని ఎద్దేవాచేశారు. అబద్ధపు ప్రచారాలు మానుకుని సూపర్ సిక్స్ – సూపర్ సెవెన్ హామీలను అమలు చేయాలని హితవు పలికారు.
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. మెగా డీఎస్సీ పరీక్ష రాసేవాడికే పరీక్షల నిర్వహణ బాధ్యతలను అప్పగించడం దారుణమని హైకోర్ట్ వ్యాఖ్యానించడాన్ని గుర్తు చేశారు. డీఎస్సీపై ఎవరైనా మాట్లాడితే లీగల్‌గా చర్యలు తీసుకుంటామని విద్యా శాఖ ప్రకటించడం సిగ్గు చేటన్నారు. మహానాడులో చేసిన తీర్మానాలన్నీ రేండేళ్ల క్రితం ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్, సెవన్ హామీల వంటివేనని ఎద్దేవా చేశారు.
2న ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ స్నాతకోత్సవాలు
7
వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర మాట్లాడుతూ.. డీఎస్సీ – 2025లో రాష్ట్రవ్యాప్తంగా భారీ స్కామ్ జరిగిందని, కట్ ఆఫ్ మార్కులు ఇవ్వకుండానే పోటీ పరీక్షలు నిర్వహించడం అందులో ఒకటని అన్నారు. సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసికూడా పోస్ట్‌లు ఎందుకు ఇవ్వలేదని, స్పోర్ట్స్ కోటాలోని 421 పోస్ట్‌లను టెట్, బీఈడీ అర్హత లేనివారికి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. కృష్ణాజిల్లా టాపర్ నవీన్‌కు ఉద్యోగం ఇవ్వలేదంటేనే జరిగిన అవినీతి అర్థం అవుతోందన్నారు. జిల్లా అధ్యక్షుడు కోమల్ సాయి మాట్లా డుతూ.. నిరుద్యోగులకు న్యాయం జరిగేంత వరకు డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలు, అవినీతిపై పోరాటాలు సాగిస్తామ న్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కేసరి శివారెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కె.కొండలరావు, జిల్లా ఉపాధ్యక్షుడు ఉదయ్‌రెడ్డి, జిల్లాలోని నియోజకవర్గాల అధ్యక్షులు ఎం.సురేష్, లక్ష్మారెడ్డి, నవీన్, నరేందర్, నందకుమార్ రెడ్డి, పలువురు డీఎస్సీ అభ్యర్థులు పాల్గొన్నారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): బెజవాడ దుర్గమ్మను ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్‌కుమార్ సిన్హా శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించారు.
విమానాశ్రయం(గన్నవరం): కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్‌కు గన్నవరం విమానాశ్రయంలో అధికారులు శుక్రవారం ఘన స్వాగతం పలికారు. కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లాలో డీఎస్పీ హోదాలో పనిచేస్తూ అదనపు ఎస్పీలుగా ప్రమోషన్ పొందిన పలువురు శుక్రవారం సీపీ రాజశేఖరబాబును మర్యాదపూర్వకంగా కలిశారు.
మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లా డుతూ.. గత ఏడాది నిర్వహించింది మెగా డీఎస్సీ కాదని దగా డీఎస్సీ అని విమర్శించారు. మెరిట్ లిస్ట్‌లను దాచేయడమే కాకుండా టాపర్ వివరాలను తొలగించడం వంటి అవకతవకలపై నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ కోటా కింద ఒక్కొక్క పోస్ట్‌ను రూ.15 లక్షల చొప్పున బేరం కుదుర్చుకుంది టీడీపీ నాయకుడు కాదా అని ప్రశ్నించారు. అంతా పారదర్శకమని చెప్పుకొనే చంద్రబాబు డీఎస్సీపై శేతపత్రం విడుదల చేయగలరా అని ప్రశ్నించారు. విద్యా వ్యవస్థకు మాయని మచ్చ తెచ్చిన మంత్రి లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.


