కిడ్నీ వ్యాధితో ఒకరు మృతి | - | Sakshi
Sakshi News home page

కిడ్నీ వ్యాధితో ఒకరు మృతి

May 30 2026 8:35 AM | Updated on May 30 2026 8:35 AM

ఎ.కొండూరు: మండలంలోని చీమలపాడు గ్రామానికి చెందిన జంపని పిచ్చియ్య (45) కిడ్నీ వ్యాధితో బాధపడుతూ శుక్రవారం ప్రభుత్వాస్పత్రిలో మృతి చెందాడు. వ్యవ సాయ పనులు చేసుకుంటూ జీవించే అత నికి భార్య పిచ్చమ్మ, 20 ఏళ్ల కుమారుడు సాయికుమార్‌, 18 ఏళ్ల కుమార్తె మహాలక్ష్మి ఉన్నారు. పిచ్చయ్య ఎనిమిది ఏళ్లుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. పిచ్చియ్యకు డయాలసిస్‌ చేయిస్తూ కాపాడుకుంటున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్యం కోసం ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని కన్నీటి పర్యంత మయ్యారు. ఇంటి పెద్దను కోల్పోయి ఆ కుటుంబం రోడ్డున పడిందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆర్థికంగా ఆదుకోవాలని సీపీఎం మండల కార్యదర్శి పానెం ఆనందరావు, జెట్టి వెంకటేశ్వరరావు ప్రభు త్వాన్ని డిమాండ్‌ చేశారు. మండలంలో జలజీవన్‌ మిషన్‌ ద్వారా అందించే కృష్ణా జలాలను పంచాయతీతో సంబంధం లేకుండా సరఫరా చేయా లని, కిడ్నీవ్యాధి గ్రస్తులకు పోషకఆహారం అందించాలని, కొండూరులోనే కిడ్నీ ఆస్పత్రి నిర్మించి ఉచితంగా మందులు పంపిణీ చేయాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement