నా సర్టిఫికెట్లను పరిశీలించారు. మూడు కౌన్సెలింగ్‌లు చేశారు. నాలుగు రోజుల తరువాత రిజక్టెడ్ లిస్ట్ వచ్చింది. అందులో నా పేరు లేకపోవడంతో కమిషనర్ ఆఫీస్‌లో భరోసా ఇచ్చారు. ఫైనల్ లిస్ట్‌లో నా పేరు లేకపోవడంతో షాకయ్యాను. నాది 190వ ర్యాంకు. నా స్థానంలో 600వ ర్యాంక్ వచ్చిన (స్పోర్ట్స్ కోటా కింద) వ్యక్తికి పోస్ట్ ఇచ్చారు. అడిగితే కోర్టులో కేసు వేసుకోమన్నారు. పోస్టులు అమ్ముడుపోయా యని అనుమానంగా ఉంది. చదువుకు విలువ ఉందా లేక జీరో ర్యాంక్ అయినా స్పోర్ట్స్‌కు విలువు ఉందా అన్నది అర్థం కావడం లేదు.
– కె.రాణి, ఆగిరిపల్లి


