రాష్ట్ర మంత్రి నారాయణ
ఇబ్రహీంపట్నం: స్థానిక ఖిల్లా రోడ్డులో ఉన్న కంప్రెస్డ్ బయో గ్యాస్(సీబీజీ) ప్లాంట్‌లో పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌తో కలసి శుక్రవారం పరిశీలించారు. సుస్థిర వ్యర్థాల నిర్వహణ, స్వచ్ఛమైన ఇంధన ఉత్పత్తి దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందన్నారు. స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలైన రాజమహేంద్రవరం, నెల్లూరు, గుంటూరు, ఒంగోలులలో నూతన ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నామన్నారు. ఇబ్రహీంపట్నంలో ఇప్పటికే ఉన్న ప్లాంట్‌ను పునరుద్ధరీకరణకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు రూ.59.85 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రతి యూనిట్ రోజుకు 25 టన్నుల సామర్థ్యంతో మొత్తం 5 ప్లాంట్ల సంయుక్త ప్రాసెసింగ్ సామర్థ్యం రోజుకు 125 టన్నులుగా ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్కో నూతన ప్లాంట్‌కు రూ.12.60 కోట్లు ఖర్చవుతుందని ఇబ్రహీంపట్నం ప్లాంట్ ఆధునికీకరణకు రూ.9.45కోట్లు అవుతుందని అంచనా వేశారు.


