గణతంత్ర స్ఫూర్తితో బాధ్యతలు నిర్వర్తించాలి
ఎదురుమొండి(నాగాయలంక): గణతంత్ర దినోత్సవం మనకు ప్రజాస్వామ్య స్ఫూర్తిని, సమానత్వాన్ని, ఐక్యతను నిరంతరం గుర్తు చేస్తుందని కేంద్ర హోం మంత్రిత్వశాఖ బీఎం–2 విభాగం డైరెక్టర్ అమర్జీత్ సింగ్ అన్నారు. దేశాభివృద్ధి కోసం ప్రతి పౌరుడు తన బాధ్యతలు గణతంత్ర స్ఫూర్తితో నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. పాలకాయతిప్ప కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో సోమ వారం జరిగిన గణతంత్ర వేడుకల్లో అమర్జీత్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై రెండు దీవుల్లో జాతీయ పతాకాలను ఎగురవేసి ప్రసంగించారు. దేశ సరిహద్దు ప్రాంతాల ప్రాముఖ్యతను చాటిచెప్పే అంశాలను వివరించారు. కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ అధికారులు మాట్లాడుతూ.. దీవుల్లో జాతీయ జెండా ఎగురవేయడం, డ్రోన్ ఫొటోగ్రఫీ, పేర్లులేని ద్వీపా లకు పేర్లు, క్రమ సందర్శనలకు జారీ చేసిన సూచనలు వంటి నిర్ణయాలను అనుసరించి కలెక్టర్ ఉత్త ర్వులు మేరకు గత ఏడాది నుంచి వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అమర్జీత్ సింగ్‌కు ఘన స్వాగతం పలికిన అధికారులు, ప్రజలు ఆయన్ను ఘనంగా సత్కరించారు. జిల్లా అదనపు ఎస్పీ వి.వి.ఎస్.నాయుడు, మైరెన్ డీఎస్పీ జి.బాలిరెడ్డి, తహసీల్దార్ సీహెచ్.వి.ఆంజనేయప్రసాద్, మైరెన్ సీఐ రావి సురేషరెడ్డి, అవనిగడ్డ సీఐ పి.యువకుమార్, నాగాయలంక ఎస్‌ఐ కె.రాజేష్, ఎఫ్‌డీఓ సాయి రామ్, ఇండియన్ కోస్ట్‌గార్డ్ అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
రిపబ్లిక్ డే వేడుకల్లో
కేంద్ర హోంశాఖ డైరెక్టర్ అమర్జీత్ సింగ్


