మసిపూసి మారేడుకాయ చేయటంలో చంద్రబాబు దిట్ట
చిలకలపూడి(మచిలీపట్నం): మసిపూసి మారేడు కాయ చేసి రాష్ట్ర ప్రజలను మోసం చేయటంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిట్ట అని వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. మచిలీపట్నంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2024 ఎన్నికల సమయంలో 25 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, 18 నెలలు వీటిని పూర్తి చేశామని రాష్ట్ర ప్రజలను మోసం చేసేలా చంద్రబాబు వ్యాఖ్యలు చేస్తున్నా రని విమర్శించారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తే ఒక్కొక్క ఉద్యోగికి నెలకు రూ.50 వేల జీతమైతే ఏడాదికి రూ.6 లక్షల చొప్పున 20 లక్షల మందికి రూ.12 వేల కోట్ల జీతాలు ఇప్పటికే వచ్చి ఉండాలన్నారు. అలా వచ్చి ఉంటే ఉద్యోగాలు ఇచ్చిన కంపెనీలు ఎంత వ్యాపారం చేసి ఉండాలి, రాష్ట్రానికి ఎంత జీఎస్టీ వచ్చిందో తెలపాలని పేర్ని నాని సవాల్ విసిరారు. అసలు ఉద్యోగాలు ఎంత మందికి ఇచ్చారో ఒక్కరి పేరైనా చెప్పగలరా అని సూటిగా ప్రశ్నించారు.
పవన్ వల్లే అలుసుగా చూస్తున్నారు
పవన్ కల్యాణ్ టీడీపీ ప్రభుత్వానికి అంటకాగటం వల్లే చంద్రబాబునాయుడు కాపు సామాజికవర్గాన్ని అలుసులుగా చూస్తున్నారని పేర్ని నాని విమర్శించారు. అమరావతి సీఆర్డీఏలో ప్లాట్లు ఇచ్చేందుకు యజమానుల నుంచి లంచం అడుగుతున్నారని, అందుకు మంత్రి నారాయణే కారకుడని పచ్చ మీడియాలో రాద్ధాంతం చేస్తున్నారని పేర్కొన్నారు. కాపు సామాజికవర్గానికి చెందిన నారాయణను తప్పించి కేంద్ర మంత్రి పెమ్మసానికి పెత్తనం ఇవ్వడానికే ఈ చర్యలని విమర్శించారు. ఇండిగో పాపాల్లో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడును డమ్మీ చేసి రూ.కోట్లు దండుకున్న చంద్రబాబు, లోకేష్ మాట్లాడకపో వటం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో రాష్ట్ర మంత్రి సత్యప్రసాద్ తప్పు చేస్తే బీజీపీదే తప్పని చెప్పిన చంద్రబాబు, లోకేష్ ప్రస్తుతం రామ్మోహన్‌నాయుడు మంత్రిగా ఉన్న శాఖలో తప్పు జరిగితే టీడీపీదే బాధ్యత కాదా అని నిలదీశారు. మంత్రి రామ్మోహన్‌నాయుడును డమ్మీ చేసి తండ్రీకొడుకులు దోచుకున్న వ్యవహారాన్ని మోదీ బయటపెడతారన్న భయంతో మాట్లాడటం లేదన్నారు. ప్రతి నెలా విమానం ఎగరాలంటే ప్రభుత్వం అను మతి తప్పనిసరిగా ఉండాలని, అప్పుడు ఎందుకు నిబంధనలు కనడపలేదని ప్రశ్నించారు.
20 లక్షల ఉద్యోగాలు ఇస్తే ఒక్క ఉద్యోగి వివరాలు చెప్పండి
ఇండిగో పాపాలను మోదీపై రుద్దాలని చంద్రబాబు, లోకేష్ యత్నం
వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని


