
సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉన్నాం
చిలకలపూడి(మచిలీపట్నం): చట్ట పరిధిలో సమస్యల పరిష్కారానికి జిల్లా పోలీస్‌శాఖ ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక మీ కోసం కార్యక్రమాన్ని నిర్వహించి ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వివిధ రకాల సమస్యలతో ఫిర్యాదులు చేయడానికి వచ్చిన వారి సమస్యలను ఎస్పీ ప్రత్యక్షంగా తెలుసుకుని వారితో ముఖాముఖి మాట్లాడి సమస్యల గురించి చింతించవద్దని, మీ సమస్యల పరిష్కారానికి భరోసా ఇస్తున్నామని వారికి ధైర్యం చెప్పారు. సంబంధిత పోలీస్ అధికారులకు ఆ ఫిర్యాదులను బదిలీ చేసి సత్వరమే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో 36 ఫిర్యాదులను ఆయన స్వీకరించారు.
రక్షణ కల్పించాలని వినతి..
● హనుమాన్‌జంక్షన్‌కు చెందిన హరి తన స్నేహితునికి వ్యక్తిగత అవసరాల నిమిత్తం రూ.3 లక్షలు అప్పుగా ఇచ్చానని చెప్పాడు. అప్పు ఇచ్చి రెండేళ్లు గడుస్తున్నప్పటికీ ఇంత వరకు డబ్బులు తిరిగి ఇవ్వకపోగా అడిగినందుకు వారి కుటుంబ సభ్యులందరూ కలిసి దాడులకు పాల్పడుతున్నారని వాపోయాడు. తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని ఎస్పీకి కోరాడు.
కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు