19న ఇన్‌చార్జి మంత్రి రాక
కాగజ్‌నగర్ టౌన్: ఈనెల 19న జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లాకు రానున్న ట్లు ఎమ్మెల్సీ దండె విఠల్ తెలిపారు. కాగజ్‌నగర్ పట్టణంలోని 30 పడకల ఆస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేస్తూ భవన ని ర్మాణానికి శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నా రు. అనంతరం పట్టణంలోని ఆర్‌ఆర్‌వో కాలనీలోని కేజీబీవీలో భవనాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. కాగా, ఆస్పత్రి ఆవరణలో మంత్రి పర్యటన కోసం చేస్తున్న ఏర్పాట్లు, స భాస్థలిని శనివారం ఎమ్మెల్సీ పరిశీలించారు. పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులకు సూచించారు. సీఐ ప్రేంకుమార్, ఎస్సై లక్ష్మణ్, నాయకులు నాసిర్, అమ్మ శ్రీకాంత్, రాజ్‌కుమార్ తదితరులున్నారు.


