వేట ఆగేదెట్లా?
పెంచికల్‌పేట్ మండలం నందిగామ వద్ద మార్చి 2న వన్యప్రాణులను హతమార్చేందుకు విద్యుత్‌తీగలు అమర్చిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు.
మార్చి 14న అగర్‌గూడ బీట్‌లో నీలుగాయిని వేటాడిన నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
మార్చి 15న లోడుపల్లిలో చుక్కల దుప్పిని వేటాడిన ముగ్గురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి దాని చర్మం స్వాధీనం చేసుకున్నారు.
కొండపల్లి అటవీ ప్రాంతంలో నీలుగాయిని వేటాడిన నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి వారిని రిమాండ్‌కు తరలించారు.
జులై 26న కమ్మర్‌గాం అటవీ ప్రాంతంలో జింకను వేటాడిన 12మందిపై అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేశారు.
పెంచికల్‌పేట్: జిల్లాలో వన్యప్రాణుల వేటకు అడ్డుకట్ట పడటం లేదు. అటవీ సమీప ప్రాంతాల్లో నిత్యం ఎక్కడో ఒకచోట అటవీ జంతువులు వేటగాళ్ల ఉచ్చులు, విద్యుత్ తీగలకు బలవుతున్నాయి. రాత్రి వేళ అటవీ సమీప ప్రాంతాల్లో వేటగాళ్లు విద్యుత్ తీగలు అమర్చి యథేచ్ఛగా దుప్పులు, జింకలు, మెకాలు, కొండ గొర్రెలు లాంటి వన్యప్రాణులను హతమారుస్తున్నారు. ఆ తర్వాత వాటి మాంసాన్ని ఇతర ప్రాంతాల్లో విక్రయిస్తూ వేటనే వృత్తిగా మలుచుకుంటు న్నారు. అటవీశాఖ అధికారులు దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నా వేటగాళ్ల తీరులో మా ర్పు కనిపించడం లేదు. గతేడాది మే 14న పెంచికల్‌పేట్ మండలంలోని ఎల్లూర్ అటవీ ప్రాంతంలో వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలకు తగిలి కే8 అనే పెద్దపులి మృతి చెందింది. నాలుగు రోజుల క్రితం ఇదే మండలంలోని లోడుపల్లి ప్రాణహిత కెనాల్ స మీపంలో వేటగాళ్లు విద్యుత్ తీగలు అమర్చి చుక్కల దుప్పిని హతమార్చిన విషయం తెలిసిందే.
నిత్యం కొనసాగుతున్న వేట
జిల్లాలో విస్తృతమైన అటవీ సంపదతో పాటు సహ జ నీటి వనరులు, నిత్యం ప్రవహించే పెద్దవాగు, ప్రాణహిత నదులున్నాయి. దీంతో అనేక రకాల వ న్యప్రాణులు వీటిని ఆవాసంగా మార్చుకుని జీవ నం సాగిస్తున్నాయి. అటవీ ప్రాంతాల్లో చెలిమెలు ఎండిపోతుండటంతో వన్యప్రాణులు నీటి కోసం మైదాన ప్రాంతాలకు వస్తున్నాయి. ఇదే అదనుగా భావిస్తున్న ఇతర ప్రాంతాలకు చెందిన వేటగాళ్లు స్థానికుల సహాయంతో వాటిని హతమారుస్తున్నా రు. మారుమూల గ్రామాల్లో జరుగుతున్న ఈ ఘట నలు గ్రామస్తుల సహకారంతో బయటికి వస్తే అట వీశాఖ అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు.
గతేడాది జరిగిన ఘటనలు
విద్యుత్ తీగలు అమరుస్తూ..
డివిజన్ పరిధిలోని కాగజ్‌నగర్, పెంచికల్‌పేట్, బెజ్జూర్, కర్జెల్లి, సిర్పూర్(టీ), కౌటాల మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో నిత్యం వన్యప్రాణుల వేట కొనసాగుతోంది. అటవీ ప్రాంతాల నుంచి వెళ్తున్న విద్యుత్ తీగలకు బైండింగ్ వైర్లు తగిలించి కిలోమీటరు వరకు కంచెగా ఏర్పాటు చేసి వన్యప్రాణులను హతమారుస్తున్నారు. పెంచికల్‌పేట్ రేంజ్‌లోని మెరెగూడ, లోడుపల్లి, అగర్‌గూడ, కొండపెల్లి, కోయచిచ్చా అటవీ ప్రాంతాల మీదుగా విద్యుత్ లైన్లు వెళ్లడం వేటగాళ్లకు అదనుగా మారింది.
గట్టి నిఘా ఏర్పాటు చేశాం
రేంజ్ పరిధిలో వన్యప్రాణుల వేటను అడ్డుకోవడానికి గట్టి నిఘా ఏర్పాటు చేశాం. నిరంతరం అటవీశాఖ అధికారులు, సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాం. వేటగాళ్లకు కౌన్సిలింగ్ ఇస్తున్నాం. ఇతర ప్రాంతాల నుంచి వేటగాళ్లు రేంజ్ పరిధిలో రాకుండా పకడ్బందీ ప్రణాళికలు అమలు చేస్తున్నాం. కొత్త వ్యక్తులు అటవీ సమీప ప్రాంతాల్లో సంచరించినట్లు ఎవరికై నా కనిపిస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలి.
– అనిల్‌కుమార్, ఎఫ్‌ఆర్‌వో, పెంచికల్‌పేట్


