చివరిరోజు కిక్కిరిసిన జంగుబాయి జాతర
కెరమెరి: మహరాజ్‌గూడ సమీపంలోగల జంగుబాయి జాతర ఉత్సవాలు శనివారం ముగిశాయి. భక్తులు మర్రిచెట్టు, పోచమ్మ, రావుడ్, మైసమ్మ, జంగుబాయి వద్ద పూజలు చేశారు. ఈసారి భక్తులు అధికసంఖ్యలో వచ్చినట్లు కటోడాలు, ఆలయ కమిటీ పభ్యులు కొడప జాకు, మరప జాబీరావు తెలిపారు. సుమారు 267 మేళాలు, తెలంగాణతోపాటు ఇతర ఆరు రాష్ట్రాలకు చెందిన 1.66 లక్షల మంది భక్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. సాయంత్రం కేస్లాపూర్‌లోని నాగోబా దేవత భేటీ కోసం జంగుబాయి తరలివెళ్లనుండగా కప్లై, సిద్దికస, దారికస, విజ్జకస, టొప్లకస ప్రాంతాల్లో గల పవిత్ర నదుల నుంచి గంగాజలాన్ని తీసుకువచ్చి ఉదయమే దేవతా విగ్రహాలను శుద్ధిచేసి ఉత్సవాలకు ముగింపు పలికారు.
చివరిరోజు కిక్కిరిసిన జంగుబాయి జాతర


