● బీసీలకు నాలుగు, జనరల్ రెండు, ఎస్సీ ఒకటి ● మున్సిపల్
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పురపాలక సంఘ ఎన్నికల రిజర్వేషన్లలో మహిళలకే పెద్దపీట దక్కింది. చైర్‌పర్సన్ స్థానాల్లో అధికంగా అతివలకే అవకాశం లభించింది. రాష్ట్రం యూనిట్‌గా చైర్‌పర్సన్, మేయర్ రిజర్వేషన్లలో సగానికి పైగా మహిళలకే ద క్కాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు 11మున్సిపాల్టీలు ఉండగా.. వీటిలో సగం స్థానాలు మహిళలకే రిజర్వ్ అయ్యాయి. ఇక వార్డులు, డివిజన్లలోనూ మహిళల కు 50శాతం ప్రాతినిధ్యం ఉంది. జనరల్ స్థానాల్లోనూ మహిళలు పోటీ చేసే అవకాశ ముంది. దీంతో మున్సిపాల్టీ పాలకవర్గాల్లో మహిళల ప్రాతినిధ్యం మరింత పెరగనుంది. రాజకీయ నాయకులు తమ కు రిజర్వేషన్ కలిసి రాని చోట్ల తమ సతీమణులను పోటీలో నిలిపి పదవులు దక్కించుకునేందుకు చ క్రం తిప్పుతున్నారు. ఇక కొందరు భార్యలతో కుదరకపోతే తమ కుటుంబ సభ్యుల నుంచి మహిళలను పోటీలో దింపాలని చూస్తున్నారు. ఇప్పటికే టికెట్ల ఎంపిక కోసం ఆశావహులు దరఖాస్తులు, సర్వేలు, ప్రజల్లో బలంతో ఆర్థిక స్థితిగతులపై అంచనాలు వేశారు. ఈ మేరకు వార్డులు, డివిజన్లలో ప్రాథమికంగా ఇద్దరు నుంచి ముగ్గురు చొప్పున జాబితా సిద్ధం చేసుకున్నారు.
ప్రతిష్టాత్మకంగా పట్టణ ఎన్నికలు
పట్టణాల్లో అత్యధిక స్థానాలను కై వసం చేసుకుని పీ ఠాలు దక్కించుకునేలా వ్యూహాలు మొదలయ్యా యి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు మున్సిపల్ పీఠాలను కై వసం చేసుకునేలా ప్రణాళికలు వేశారు. బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపి పట్టణాల్లో జెండా ఎగురవేయాలని భావిస్తున్నారు. జిల్లా కేంద్రాలైన ఆదిలా బాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాలతోపాటు నియోజకవర్గ కేంద్రాల్లో పట్టు పెంచుకోవాలని సిద్ధమయ్యారు. 2020లో మున్సిపల్ ఎన్నికలు జరిగా యి. నాటి ఫలితాల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎంఐఎం మినహా అన్ని చోట్ల బీఆర్‌ఎస్ మున్సిపాల్టీలను కై వసం చేసుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ జోరుకు గండి పడి పది నియోజకవర్గాల్లో రెండు ఎమ్మెల్యే స్థానాలకు పరిమితం కాగా.. నా లుగు బీజేపీ, నాలుగు కాంగ్రెస్ గెలుచుకున్నాయి. మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆదిలాబాద్ బీజే పీ, పెద్దపల్లి కాంగ్రెస్ గెలుచుకోగా.. రాజకీయంగా మార్పులు వచ్చాయి. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పది నియోజకవర్గాల్లోనూ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు సర్పంచులను గెలిపించుకుని ప్రభావం చూపించారు. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
మంచిర్యాల తొలి మేయర్ బీసీలకే..
ఉమ్మడి జిల్లాలో ఏకై క మున్సిపల్ కార్పొరేషన్ మంచిర్యాల. పట్టణం నుంచి అప్‌గ్రేడ్ అ య్యాక జరుగుతున్న తొలి ఎన్నికల్లో కీలకమైన మేయర్ పీఠం రిజర్వేషన్లలో బీసీలనే వరించింది. బీసీ జనరల్ కేటగిరీ కావడంతో ఆ వర్గ నాయకుల్లో ఆసక్తిని పెంచింది. పోటీలో నిలిచే బీసీ నాయకులు మేయర్ పీఠంపై కన్నేశారు. నగరంలో మొత్తం 1.81లక్షల ఓట ర్లున్నారు. 60డివిజన్లతో ఓ అసెంబ్లీ నియోజకవర్గ పరిధితో సమంగా, పరిపాలనలోనూ ప్రత్యేక కనబర్చనుంది. దీంతో నగర ప్రథమ పౌరుడిగా రాజకీయంగా, ప్రొటోకాల్, అధికా రిక హోదా విస్తృతంగా ఉండనుంది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ మేయర్ పీఠం దక్కించుకోవాలని పావులు కదుపుతున్నాయి.


