రిజర్వేషన్లు ఖరారు
ఆసిఫాబాద్‌అర్బన్/కాగజ్‌నగర్ టౌన్: మున్సిపల్ ఎన్నికలకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మున్సిపల్ అధికారులు, వివిధ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపల్ వార్డుల రిజర్వేషన్ ప్రక్రియ నిర్వహించారు. ఆసిఫాబాద్ మున్సిపల్ పరిధిలోని 20 వార్డులు, కాగజ్‌నగర్ మున్సిపల్ పరిధిలో 30 వార్డులకు డెడికేషన్ కమిషన్ నిర్ణయం ప్రకారం లాటరీ పద్ధతిలో రిజర్వేషన్లు కేటాయించారు. జిల్లాలోని రెండు మున్సిపాలిటీల చైర్మన్ పదవులను బీసీలకు కేటాయించారు. ఆసిఫాబాద్ బల్దియాను బీసీ జనరల్‌కు, కాగజ్‌నగర్ మున్సిపాలిటీని బీసీ మహిళకు రిజర్వ్ చేశారు.
ఆసిఫాబాద్ వార్డుల కేటాయింపు ఇలా..
ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో 20వార్డులుండగా ఇందులో ఒకటి ఎస్టీ జనరల్, ఒకటి ఎస్టీ మహిళ, రెండు ఎస్సీ జనరల్, ఒకటి ఎస్సీ మహిళ, మూడు జనరల్, రెండు బీసీ మహిళ, నాలుగు జనరల్, ఆరు జనరల్ మహిళకు కేటాయించారు. 20వార్డుల్లో 13,927 మంది ఓటర్లున్నారు. ఇందులో పురుషులు 6,822 మంది, మహిళలు 7,103 మంది కాగా, ఇద్దరు ఇతరులున్నారు.
కాగజ్‌నగర్ వార్డుల రిజర్వేషన్లు..
కాగజ్‌నగర్ మున్సిపాల్టీలో 30 వార్డులుండగా, తొమ్మిది జనరల్ మహిళకు, నాలుగు బీసీ మహిళకు, రెండు ఎస్సీ మహిళకు, ఆరు జనరల్‌కు, ఐదు బీసీ జనరల్‌కు, మూడు ఎస్సీ జనరల్‌కు, ఒకటి ఎస్టీ జనరల్‌కు కేటాయించారు. కాగా, 30వార్డుల పరిధిలో 51,205 మంది ఓటర్లున్నారు. ఇందులో పురుషులు 25,004 మంది, మహిళలు 26,193 మంది కాగా, ఎనిమిదిమంది ఇతరులున్నారు. 30వ వార్డు ఎస్టీ జనరల్, 2, 25, 28 వార్డులు ఎస్సీ జనరల్, 12, 19వార్డులు ఎస్సీ మహిళ, 1, 3, 4, 13 వార్డులు బీసీ మహిళ, 15, 16, 17, 22, 29 వార్డులు బీసీ జనరల్, 6, 7, 9, 14, 18, 20, 21, 23, 27 వార్డులు జనరల్ మహిళ, 5, 8, 10, 11, 24, 26 వార్డులను జనరల్‌కు కేటాయించారు.
వార్డులవారీగా
ఆసిఫాబాద్ బల్దియా రిజర్వేషన్లు..
వార్డు రిజర్వేషన్
1. ఎస్సీ జనరల్
2. బీసీ జనరల్
3. బీసీ జనరల్
4. ఎస్టీ జనరల్
5. బీసీ మహిళ
6. జనరల్
7. జనరల్ మహిళ
8. బీసీ మహిళ
9. జనరల్
10. ఎస్సీ జనరల్
11. బీసీ జనరల్
12. ఎస్టీ మహిళ
13. జనరల్ మహిళ
14. జనరల్ మహిళ
15. జనరల్
16. ఎస్సీ మహిళ
17. జనరల్
18. జనరల్ మహిళ
19. జనరల్ మహిళ
20. జనరల్ మహిళ


