
డెంగీతో విద్యార్థి మృతి
తిర్యాణి: డెంగీతో ఓ విద్యార్థి మృతి చెందాడు. తల్లిదండ్రులు, ఆర్‌బీఎస్‌కే వైద్యుడు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పంగిడిమాదర పంచాయతీ పరిధి రాజాగూడ గ్రామానికి చెందిన ఆత్రం సీతారాం–దివ్యజ దంపతులకు ఇద్దరు కుమారులు. మొదటి కుమారుడు ఆత్రం అనురాగ్ (12) స్థానిక ఆశ్రమ పాఠశాలలో ఆరోతరగతి చదువుతున్నాడు. ఈనెల 14న అతడికి జర్వం రావడంతో పాఠశాల నుంచి ఇంటికి వెళ్లాడు. అదేరోజు సాయంత్రం తల్లిదండ్రులు మండల కేంద్రంలోని సీహెచ్‌సీలో చేర్పించారు. 15న వైద్య సిబ్బంది రక్త పరీక్షలు నిర్వహించగా వ్యాధి నిరార్ధణ కాలేదు. అయినప్పటికీ జర్వం తగ్గకపోవడంతో 18న రక్త పరీక్షలు నిర్వహించి తెల్లరక్త కణాలు తగ్గినట్లు గుర్తించారు. 19న మంచిర్యాలలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి డెంగీగా నిర్ధారించారు. ఈనెల 21న బాలుడి పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించి చికిత్స అందిస్తుండగా సోమవారం రాత్రి మృతి చెందాడు. బాధిత కుటుంబాన్ని ఆర్డీవో లోకేశ్వర్‌రావు, డీటీడీవో రమాదేవి, ఎంపీడీవో మల్లేశ్ పరామర్శించారు. కాగా, తిర్యాణి సీహెచ్‌సీలో వైద్య సిబ్బంది వ్యాధి నిర్ధారణలో నిర్లక్ష్యంగా వ్యవహరించి మూడు, నాలుగు రోజులు మామూలు వైద్యం అందించారని తల్లిదండ్రులు ఆరోపించారు. పరిస్థితి విషమించగా మంచిర్యాల ఆస్పత్రికి రిఫర్ చేశారని వాపోయారు. వైద్య సిబ్బంది సరైన చికిత్స అందించి ఉంటే తమ కొడుకు బతికేవాడని ఆవేదన వ్యక్తంజేశారు. కాగా, విద్యార్థికి జర్వం వస్తున్నా ఉన్నతాధికారులకు తెలుపకుండా నిర్లక్ష్యం వహించిన పాఠశాల ప్రధానోపాధ్యా యుడు సాగర్‌ను సస్పెండ్ చేసినట్లు డీటీడీవో రమాదేవి తెలిపారు. అలాగే విధులను నిర్లక్ష్యం చేసిన ఏఎన్‌ఎం సువార్తను విధుల నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం పాఠశాల హెచ్‌ఎంగా సీనియర్ ఉపాధ్యాయుడు తిరుపతికి అదనపు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు.
నిందితుడి రిమాండ్
ఆదిలాబాద్‌రూరల్: మండలంలోని బంగారుగూడ కాలనీలో ఓ వ్యక్తిని బెదిరించి నగదు దొంగిలించిన డీసీ సీటర్ ఖద్ధర్‌ను గురువారం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై విష్ణువర్ధన్ తె లిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. బంగారుగూడకు చెందిన ముత్యాలు ఆ ప్రాంతంలో చేపలు విక్రయిస్తున్నాడు. అదే కాలనీకి చెందిన డీసీ సీటర్ ఖద్ధర్ ముత్యాలును బె దిరించి రూ.1,500 దొంగిలించి పరారయ్యా డు. అంతేకాకుండా ముత్యాల పక్కనున్న శ్రీని వాస్‌పై దాడి చేశాడు. దీంతో బాధితుల ఫిర్యా దు మేరకు బుధవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఖద్ధర్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
కలప పట్టివేత
దండేపల్లి: మండలంలోని నంబాల గోదావరి తీరం వద్ద అక్రమంగా తరలించేందుకు నిల్వ చేసిన 15 టేకు దుంగలను మంగళవారం తమ సిబ్బంది పట్టుకున్నట్లు తాళ్లపేట అటవీ రేంజ్ అధికారి సుష్మారావు తెలిపారు. పట్టుకున్న కలప విలువ రూ.42,329 ఉంటుందని పేర్కొన్నారు. కలపను రేంజ్‌కి తరలించినట్లు తెలిపారు. అటవీ సిబ్బంది ఎఫ్‌ఎస్‌వో నరేశ్, ఎఫ్‌బీవో నాగరాజుచారి, టైగర్ ట్రాకర్ ప్రశాంత్, బేస్ క్యాంప్ వాచర్ పాల్గొన్నారు.
చోరీకి పాల్పడ్డ నిందితుల అరెస్ట్
ఆదిలాబాద్‌టౌన్: చోరీలకు పాల్పడిన ముగ్గు రు నిందితులను అరెస్ట్ చేసినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 19న తిర్పెల్లిలోని శ్రీనివాస వైన్స్‌లో ఐదుగురు దొంగతనానికి పాల్పడగా అందులో షేక్ బిలాల్, మహ్మద్ షారుఖ్‌ను మంగళవారం అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఇద్దరు నిందితులను అదుపులోకి తీ సుకోగా, మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిపా రు. అలాగే ఈనెల 6న సంజయ్‌నగర్ కాలనీకి చెందిన శానం నవీన్‌కుమార్ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన మహారాష్ట్రకు చెందిన మా ర్కులే అనిల్‌ను మంగళవారం అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. మూడు తులాల బంగారం చోరీ కి పాల్పడగా, నిందితుడి నుంచి అర తులం రికవరీ చేసినట్లు సీఐ తెలిపారు.

డెంగీతో విద్యార్థి మృతి

డెంగీతో విద్యార్థి మృతి

డెంగీతో విద్యార్థి మృతి