హామీలు అమలు చేసేవరకు ఉద్యమం | - | Sakshi
Sakshi News home page

హామీలు అమలు చేసేవరకు ఉద్యమం

Nov 27 2026 1:14 AM | Updated on Nov 27 2026 1:14 AM

ఖమ్మంమయూరిసెంటర్‌: ఢిల్లీలో జరిగిన రైతుల ఆందోళన సమయాన కేంద్ర ప్రభుత్వం రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేసే ఉద్యమాలు సాగిస్తామని లని రైతు, వ్యవసాయ కార్మిక సంఘా ల నాయకులు స్పష్టం చేశారు. సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కేఎం) పిలుపు మేరకు గురువారం ఖమ్మంలో మోటార్‌ సైకిల్‌ ప్రదర్శన నిర్వహించారు. పెవిలియన్‌ గ్రౌండ్‌ నుంచి జెడ్పీ సెంటర్‌లోని అంబేద్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్‌తో పాటు వివిధ సంఘాల నాయకులు కొండపర్తి గోవిందరావు, బందెల వెంకయ్య, వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం అధి కారంలోకి వచ్చినప్పటి నుంచి కార్పొరేట్లకు రాయితీ లు ఇస్తూ రైతులపై భారాలు మోపుతున్నారని ఆరో పించారు. కరువు, తుపాను కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం ప్రకటించడమే కాక ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు చే యాలని డిమాండ్‌ చేశారు. నాయకులు బొంతు రాంబాబు, మాదినేని రమేష్‌, దొండపాటి రమేష్‌, మలీ దు నాగేశ్వరరావు, కొల్లేటి నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, మేరుగు సత్యనారాయణ, పొన్నం వెంకటేశ్వరరావు, ఎస్‌కె మీరా, వాసిరెడ్డి ప్రసాద్‌ పాల్గొన్నారు.

ర్యాలీలో రైతు, వ్యవసాయ

కార్మిక సంఘాల నేతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement