రైతులకు బాసటగా ‘సాక్షి’ | - | Sakshi
Sakshi News home page

రైతులకు బాసటగా ‘సాక్షి’

Nov 27 2026 1:14 AM | Updated on Nov 27 2026 1:14 AM

నేడు జిల్లా వ్యవసాయాధికారితో ఫోన్‌ ఇన్‌

ఖమ్మంవ్యవసాయం: ఎల్‌నినోతో వర్షాభావ పరిస్థితులు నెలకొని భూగర్భ జలాలు అడుగుంటుతున్నాయి. ఈక్రమాన రానున్న యాసంగి సీజన్‌లో తక్కువ నీరు అవసరమయ్యే ఆరుతడి పంటలే సాగు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు ప్రచారం చేస్తున్నారు. ఈమేరకు ఏయే పంటలు సాగు చేయాలి, విత్తనాలు, ఎరువుల లభ్యత, సబ్సిడీలపై రైతులకు అవగాహన కల్పించాలని ‘సాక్షి’ నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లా వ్యవసాయ శాఖ ఆధికారి ధనసరి పుల్లయ్య వాతావరణ పరిస్థితులు, పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తారు. అన్నదాతలు నిర్ణీత సమయంలో కింద పేర్కొన్న నంబర్‌కు ఫోన్‌ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

తేదీ : 27–11–2026, శుక్రవారం (నేడు)

సమయం : ఉదయం 9నుంచి

10 గంటల వరకు

ఫోన్‌ చేయాల్సిన నంబర్‌

89777 47500

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement