● రాజ్యాంగ దినోత్సవంలో
అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి
ఖమ్మం సహకారనగర్: రాజ్యాంగ విలువలు, ఆశయాలకు ప్రతీఒక్కరు కట్టుబడి ఉండాలి అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం కలెక్టరేట్‌లో రాజ్యాంగ పీఠిక చదడంతో పాటు అధికారులు, సిబ్బందితో ప్రతి జ్ఞ చేయించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థకు రాజ్యాంగమే పునాది అని, రాజ్యాంగం నిర్దేశించిన విలు వలు, ఆశయాలను ప్రతీ ఒక్కరూ గౌరవించి, ఆచరించాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మార్క్‌ఫెడ్‌లో డీసీఎంఎస్ విలీనంపై రేపు మహాజన సభ
ఖమ్మంవ్యవసాయం: జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్)ను మార్క్‌ఫెడ్‌లో విలీనం చేసే అంశంపై శనివారం మహాజన సభ నిర్వహిస్తున్నట్లు డీసీఎంఎస్ పర్సన్ ఇన్‌చార్జి, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మంలోని డీసీసీబీ కార్యాలయంలో శనివారం 11గంటలకు మొదలయ్యే సభలో విలీనంపై సభ్యుల అభిప్రాయాలను సేకరించనున్నట్లు వెల్లడించారు. అలాగే, సంస్థ ఆస్తులు, ఇతర అంశాలపై చర్చించడంతో పాటు సభ్యుల అభ్యంతరాలను స్వీకరిస్తామని తెలిపారు. ఈమేరకు ఉమ్మడి జిల్లా పరిధిలోని పీఏసీఎస్‌ల చైర్మన్లు, బీ–క్లాస్ సభ్యులు, సహకార శాఖ అధికారులు హాజరుకావాలని అదనపు కలెక్టర్ సూచించారు.
డిగ్రీ పరీక్షల్లో జోరుగా మాస్ కాపీయింగ్?
నేలకొండపల్లి: నేలకొండపల్లి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఈనెల 16 నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు జరుగుతుండగా మాస్ కాపీయింగ్ జోరుగా సాగుతోందనే విమర్శలు వస్తున్నాయి. కేంద్రం గురువారం ఫిజిక్స్, ఎకానమిక్స్, జువాలజీ, కామర్స్ పరీక్షలు జరగగా, ఆరు బయట కొంద రు పాఠ్యపుస్తకాల్లో పేజీలను చిన్నసైజ్‌లో జిరా క్స్ తీయించి లోపలికి పంపించినట్లు గుర్తించా రు. కేంద్రంలో స్క్వాడ్ ఉన్నప్పటీకీ జిరాక్స్‌లు ఎలా పంపారనే ప్రశ్న తలెత్తగా, సిలబస్ పూర్తి కాకపోవడంతో ఎవరైనా సిబ్బంది సహకరించా రా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇంకొందరు కాలేజీ ఆవరణలో జిరాక్స్ ప్రతులను సిద్ధం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయమై కాలేజీ ప్రిన్సి పాల్ పరంజ్యోతిని వివరణ కోరగా కాపీయింగ్ జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపా రు. జిరాక్స్‌ల విషయమై విచారణ చేపడతామని పేర్కొన్నారు.


