ముదిగొండ: పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత నమోదయ్యేలా ఇప్పటి నుంచే విద్యార్థులను సన్నద్ధం చేయాలని డీఈఓ వాసంతి సూచించారు. మండలంలోని మేడేపల్లి ప్రాథమిక, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలు, ముదిగొండలోని మిట్టగూడెం ప్రాథమిక పాఠశాలను గురువారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బోధన, విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించాక ఆమె మాట్లాడారు. పదో తరగతి విధ్యార్థులతో డీఈఓ వాసంతి మాట్లాడారు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా బోధిస్తూ, వెనుకబడిన వారిని గుర్తించి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈకార్యక్రమంలో ఎంఈఓ రమణయ్య, ఎఫ్‌ఎల్‌ఎన్ బృందం సభ్యులు ప్రవీణ్‌కుమార్, శ్రావణ్‌కుమార్ పాల్గొన్నారు.


