● ఆటోను ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఘటన
తిరుమలాయపాలెం: పనికి వచ్చిన వెళ్తున్న కూలీ ఆటోను ట్రాక్టర్ ఢీకొట్టడంతో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. సూర్యాపేట జిల్లా మోతే మండలం తుమ్మగూడెం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు రోజులాగే గురువారం తిరుమలాయపాలెం మండలం కాకరవాయికి వచ్చి పనులు ముగించుకొని సాయంత్రం ఆటోలో తిరుగు పయనమయ్యారు. వీరి ఆటోను ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టడంతో ముగ్గురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. తుమ్మగూడెంకు చెందిన పులిగుజ్జు నాగమణి, మొక్క రామక్క, దుంపటి రమాదేవికి తీవ్ర గాయాలు కాగా మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. దీంతో క్షతగాత్రులను 108లో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన పోలీసులు విచారణ చేపట్టారు.


