ఖమ్మంఅర్బన్: ఖమ్మం 11వ డివిజన్ మాజీ కార్పొరేటర్ సరిపూడి రమ ఓటు గల్లంతైంది. ప్రస్తుతం 10వ డివిజన్ పరిధిలో నివాసముంటున్న ఆమె ఓటు కోసం అవసరమైన దరఖాస్తు పత్రాలను అందజేశారు. అయితే కుటుంబ సభ్యులందరి పేర్లు ముసాయిదా జాబితాలో ఉన్నా ఆమె పేరు లేకపోవడంతో కలెక్టర్, కేఎంసీ కమిషనర్‌తో పాటు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఈ విషయమై కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్యను కలవగా విచారణ చేస్తామని చెప్పినట్లు పేర్కొన్నారు. కాగా, రమ ఓటు హక్కు విషయమై కలెక్టర్ ఓ బీఎల్‌ఓ, సూపర్‌వైజర్‌పై విచారణకు ఆదేశించినట్లు సమాచారం.


