ఎప్పటికప్పుడు పరిశీలన, పరిస్కారం | - | Sakshi
Sakshi News home page

ఎప్పటికప్పుడు పరిశీలన, పరిస్కారం

Sep 1 2026 12:55 AM | Updated on Sep 1 2026 12:55 AM

‘గ్రీవెన్స్‌ డే’లో అదనపు శ్రీజ

ఖమ్మం సహకారనగర్‌: ప్రజలు అందిస్తున్న దరఖాస్తులు, వినతులను ఎప్పటికప్పుడు పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ పి.శ్రీజ సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఆమె అదనపు కలెక్టర్‌ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం అధికారులతో సమావేశమై పరిశీలన, పరిష్కారంపై సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ రామమూర్తి, కలెక్టరేట్‌ ఏఓ కె.శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఫిర్యాదుల్లో కొన్ని..

● కామేపల్లి మండలం గోవింద్రాలకు చెందిన సంతోష్‌ లకావత్‌ ప్రత్యేక అధికారి పాలన సమయాన జరిగిన రూ.9లక్షల బిల్లులు చెల్లింపుపై విచారణ చేయించాలని కోరారు. దీంతో విచారణ చేపట్టి 9వ తేదీ నాటికి నివేదిక ఇవ్వాలని డిప్యూటీ సీఈఓను అదనపు కలెక్టర్‌ ఆదేశించారు.

● కల్లూరు మండలం తాళ్లూరి వెంకటాపురానికి చెందిన పాశం నాగేశ్వరరావు తన కుమార్తె పాశం ప్రియమణిని లంకపల్లి బీసీ గురుకులం నుంచి రెబ్బవరం బీసీ గురుకులానికి మార్చాలని కోరారు.

● తిరుమలాయపాలెం మండలం తాళ్లచెరువుకు చెందిన జోగుపర్తి బుచ్చమ్మ తన భర్త మరణించాక ఆయన పేరిట ఉన్న 6–30 ఎకరాల భూమిని కుమారుడు, కోడలు వారి పేరిట పాస్‌ పుస్తకం చేయించుకున్నందున న్యాయం చేయాలని విన్నవించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement