పోలీసు ఉద్యోగులకు ప్రతిభా పురస్కారాలు | - | Sakshi
Sakshi News home page

పోలీసు ఉద్యోగులకు ప్రతిభా పురస్కారాలు

Sep 1 2026 12:55 AM | Updated on Sep 1 2026 12:55 AM

ఖమ్మంక్రైం: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్‌ 2న రాష్ట్ర ప్రభుత్వం విధుల్లో ప్రతిభ కనబరిచిన పలువురు పోలీసు అధికారులకు పతకాలు ప్రకటించింది. ఇందులో జిల్లా నుంచి అడిషనల్‌ డీసీపీ రామానుజం, హెడ్‌కానిస్టేబుళ్లు బిక్షపతి, సూర్యప్రకాష్‌రెడ్డి ఉత్తమ సేవా పతకాలకు ఎంపికయ్యారు. అలాగే, మరో 12మంది ఉద్యోగులకు కూడా పతకాలు ప్రకటించగా... సోమవారం ఖమ్మంలో వారికి పోలీసు కమిషనర్‌ సునీల్‌దత్‌ పతకాలు అందజేసి అభినందించారు.

రిటైర్డ్‌ ఉద్యోగులకు సన్మానం

జిల్లా పోలీసు శాఖలో విధులు నిర్వర్తిస్తూ సోమవారం రిటైర్‌ అయిన వారిని సీపీ సునీల్‌దత్‌ సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. సుదీర్ఘకాలం వివిధ విభాగాల్లో బాధ్యతాయుతమైన విధులు నిర్వర్తించారని కొనియాడారు. ఉద్యోగ విరమణ చేసిన వారిలో ఎస్‌ఐలు సుధాకర్‌రెడ్డి, రాయప్ప, రామారావు, ఏఎస్సైలు శ్రీనివాసరావు, అబుల్ద్‌ రెహమాన్‌, హెడ్‌ కానిస్టేబుళ్లు అహ్మద్‌, సత్యం, సుందర్‌రావు, వెంకటేశ్వర్లు ఉండగా, సీపీతో పాటు అడిషనల్‌ డీసీపీ రామానుజం, ఆర్‌ఐలు కామరాజు, సురేష్‌, పోలీసు అసోసియేషన్‌ అధ్యక్షుడు హేమనాధ్‌, హోంగార్డు నాయకులు బంక శ్రీను, వెంకటేశ్వర్లు వారిని సన్మానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement