లెక్క తప్పుతోంది.. | - | Sakshi
Sakshi News home page

లెక్క తప్పుతోంది..

Jul 14 2026 12:18 AM | Updated on Jul 14 2026 12:18 AM

జాడే లేని వానలు

ఇప్పటివరకు లక్ష్యంలో 6.41శాతమే పూర్తి

ఎల్‌నినో ప్రభావంతో

వర్షాలు లేక ఎదురుచూపులు

పర్యావరణ సమతుల్యతను కాపాడడం, పచ్చదనం పెంపు కోసం ఏటా ప్రభుత్వం వన మహోత్సవం నిర్వహిస్తోంది. సహజంగా జూన్‌ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించగానే, వన మహోత్సవ హడావుడి ప్రారంభమవుతుంది. ఈసారి జూన్‌ నెలలో రంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి వనమహోత్సవాన్ని ప్రారంభించారు. జిల్లాలోనూ మొదలుపెట్టినా, వర్షాలు సరిగ్గా లేక కార్యక్రమం అంతంత మాత్రంగానే నడుస్తోంది.

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: పచ్చదనం పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా అమలు చేస్తున్న వన మహోత్సవ కార్యక్రమానికి ఈసారి వర్షాభావ పరిస్థితులు అడ్డొచ్చాయి. ఎల్‌నినో ప్రభావంతో ఇప్పటివరకు సరైన వర్షాలు లేక అంతంతమాత్రంగానే మొక్కలు నాటారు. ఏటా జూన్‌లో వర్షాలు మొదలుకాగానే ప్రభుత్వ శాఖల వారీగా లక్ష్యాల మేరకు మొక్కలు నాటడం మొదలుపెడతారు. కానీ ఈసారి జూలై వచ్చినా ఒక్క భారీ వర్షం లేకపోగా, మొక్కలు నాటినా సంరక్షణ కష్టమనే భావనతో అధికారులు వేచిచూసే ధోరణి అవలంబిస్తున్నారు. జిల్లాలో 31.30 లక్షల మొక్కలను నాటాలని నిర్దేశించుకున్నా, ఇప్పటి వరకు నాటింది, పంపిణీ చేసినవి రెండు లక్షలే కావడం గమనార్హం.

సంరక్షణ కష్టమే..

వర్షాకాలం వచ్చి నెల దాటినా జిల్లాలో ఇంకా పొడి వాతావరణమే కొనసాగుతోంది. మబ్బులు పట్ట డం, జల్లులు కురవడమే తప్ప పెద్దవర్షాలు లేక భూమిలో వేడి చల్లారలేదు. ఈ పరిస్థితుల్లో మొక్కలు నాటడం సబబు కాదని, నాటినా సంరక్షించడం కష్టమని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యాన భారీ వర్షాలు పడే వరకు మరికొంత సమయం వేచిచూసే అవకాశం ఉంది.

దూరంగా లక్ష్యం

జిల్లాలో ఈ ఏడాది 31.30 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ మేరకు శాఖల వారీగా లక్ష్యాలు కేటాయించి నర్సరీల్లో మొక్కలు సిద్ధం చేశారు. ప్రస్తుతం మొక్కలు నాటేందుకు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఇప్పటి వరకు 1,99,400 మొక్కలే నాటగా.. 1,100 మొక్కలరు పంపిణీ చేశారు. అంటే లక్ష్యంలో కేవలం 6.41 శాతమే పూర్తయింది.

వర్షాలు కురిస్తేనే..

జిల్లాలో పూర్తిస్థాయిలో వర్షాలు కురిస్తేనే వన మహోత్సవం జోరందుకోనుంది. అధికారులు నర్సరీల్లో మొక్కలు సిద్ధం చేసి, ఎక్కడెక్కడ నాటాలో కూడా స్థలాలను ఎంపిక చేశారు. ప్రస్తుతం నర్సరీల్లో వెదురు, మందార, చింత, దానిమ్మ, ఎర్ర తురాయి, కానుగ, నెమలినార, ఉసిరి, వేపతో పాటు ఇతర మొక్కలను పెంచారు. జూలైలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించగా, రెండు వారాలు దాటినా ఆ పరిస్థితి కానరావడం లేదు. ఈనెలాఖరు వరకై నా భారీ వర్షం కురిస్తే వన మహోత్సవం చకచకా చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు.

శాఖల వారీగా నాటాల్సిన మొక్కలు

వన మహోత్సవంలో 31.30లక్షల మొక్కలు నాటేలా ప్రణాళిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement