కుడి, ఎడమ కాల్వలకు నీరు విడుదల | - | Sakshi
Sakshi News home page

కుడి, ఎడమ కాల్వలకు నీరు విడుదల

Jul 14 2026 12:18 AM | Updated on Jul 14 2026 12:18 AM

వైరా: వైరా రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలు చేరడంతో ఆయకట్టులో సాగు అవసరాల నిమిత్తం కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటిని వైరా ఎమ్మెల్యే మాలోత్‌ రాందాస్‌నాయక్‌ సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రిజర్వాయర్‌ ఆయకట్టు రైతులకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా గోదావరి జలాలు చేర్చామని తెలిపారు. ఈ నీటిని ప్రతీ ఎకరాకు అందేలా చర్యలు చేపట్టామని, రైతులు నీరు పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్‌ పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, ప్రజాప్రతినిధులు, అధికారులు నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement