డీఫాల్ట్‌ మిల్లర్లపై క్రిమినల్‌ కేసులు | - | Sakshi
Sakshi News home page

డీఫాల్ట్‌ మిల్లర్లపై క్రిమినల్‌ కేసులు

Feb 26 2026 8:35 AM | Updated on Feb 26 2026 8:35 AM

డీఫాల్ట్‌ మిల్లర్లపై  క్రిమినల్‌ కేసులు

డీఫాల్ట్‌ మిల్లర్లపై క్రిమినల్‌ కేసులు

రఘునాథపాలెం: పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఫలితాల సాధనే లక్ష్యంగా ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలని భద్రాచలం ఐటీడీఎ ఏపీఓ(జనరల్‌) డేవిడ్‌రాజ్‌ సూచించారు. రఘునాథపాలెంలోని గిరిజన ప్రతిభా పాఠశాలను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ మల్లెల బాలస్వామి, వైస్‌ ప్రిన్సిపాళ్లు మిట్టపల్లి నరసింహారావు, మాలోతు శ్రీనివాస్‌, ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేసేలా ప్రత్యేక తరగతుల నిర్వహణ, వెనుకబడిన విద్యార్థులపై శ్రద్ధ, గత వార్షిక పరీక్షల్లో ఫలితాలపై చర్చించి సూచనలు చేశారు. అనంతరం ఇంటర్‌మీడియట్‌ విద్యార్థులతో మాట్లాడిన ఏపీఓ.. ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించాలని తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

రెండు మిల్లుల నుంచి

రూ.17కోట్లకు పైగా సీఎంఆర్‌ బకాయిలు

ఖమ్మంసహకారనగర్‌: కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌) ఒప్పందం నిబంధనలను ఉల్లంఘించి, ప్రభుత్వానికి బకాయిలు చెల్లించని రైస్‌ మిల్లుల యాజమాన్యాలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసినట్లు అదనపు కలెక్టర్‌ పి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం రూరల్‌ మండలం మంగళగూడెంలోని శ్రీ సత్యనారాయణ సిల్కీ సార్టెక్స్‌ రైస్‌ మిల్‌ యాజమాన్యం 2021–22 ఖరీఫ్‌, 2022–23 ఖరీఫ్‌, రబీ, 2023–24 ఖరీఫ్‌ సీజన్లలో ప్రభుత్వానికి లక్ష్యం మేర బియ్యం అందజేయడంలో విఫలమైందని పేర్కొన్నారు. ఈ బియ్యం విలువ రూ.9.49 కోట్లు కాగా, జరిమానాతో కలిపి రూ.13.84 కోట్ల వరకు చేరిందని తెలిపారు. దీంతో మిల్లు భాగస్వాములు కన్నేటి జ్యోతి, మామిడాల మానసపై ఖమ్మం రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైందని వెల్లడించారు. అలాగే, నేలకొండపల్లి మండలం రాయిగూడెంలోని వెంకటేశ్వర రైస్‌ మిల్లు నుంచి 2022–23 ఖరీఫ్‌, రబీ సీజన్లలో రావాల్సిన బియ్యం విలువ రూ.7.59 కోట్లుకాగా, పెనాల్టీతో కలిపి రూ.10.88 కోట్లకు చేరడంతో యజమాని మేకల రామారావుపై నేలకొండపల్లి పోలీసుస్టేషన్‌లో కూసు నమోదైందని పేర్కొన్నారు. సీఎంఆర్‌ అందించడంలో డీఫాల్ట్‌ అయ్యే మిల్లర్లపై చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని అదనపు కలెక్టర్‌ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.

రేపు ‘దిశ’ సమావేశం

ఖమ్మంసహకారనగర్‌: కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలపై సమీక్షించే జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ(దిశ) సమావేశం శుక్రవారం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి తెలపారు. కలెక్టరేట్‌లో దిశ కమిటీ చైర్మన్‌, ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. సభ్యులు కూడా పాల్గొనే ఈమావేశానికి అధికారులు పూర్తి సమాచారంతో హాజరుకావాలని కలెక్టర్‌ ఓ ప్రకటనలో సూచించారు.

వంద శాతం ఫలితాల సాధనే లక్ష్యం

నెలాఖరులోగా అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్‌

బోనకల్‌: అసంక్రమిత వ్యాధులతో బాధపడుతున్న వారిని గుర్తించేలా చేపడుతున్న స్క్రీనింగ్‌ను ఈనెలాఖరులోగా పూర్తిచేయాలని డీఎంహెచ్‌ఓ రామారావు సూచించారు. బోనకల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మందుల లభ్యత, రోజువారీ ఓపీ రిజిస్టర్లను పరిశీలించాక ఉద్యోగులతో సమావేశమయ్యారు. అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్‌పై అందరూ ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఆతర్వాత గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ.. వంట గది, స్టోర్‌ రూం తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడి పరీక్షలపై ఆందోళన చెందొద్దని సూచించారు. వైద్యులు స్రవంతి, ఉదయశ్రీ, అనూష, ఉద్యోగులు రాధాలత, పద్మావతి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement