సదస్సుకు సైన్స్ టీచర్లు
ఇదే ప్రధాన ఇతివృత్తం
● 28న హైదరాబాద్‌లో ఎస్‌సీఈఆర్‌టీ సదస్సు ● జిల్లా నుంచి ముగ్గురు ఉపాధ్యాయుల ఎంపిక
ఖమ్మంసహకారనగర్: జిల్లాకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులకు అరుదైన గౌరవం దక్కింది. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర విద్య శిక్షణ పరిశోధన మండలి(ఎస్‌సీఈఆర్‌టీ) ఆధ్వర్యాన ఈనెల 28న హైదరాబాద్‌లో వైజ్ఞానిక సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సులో జిల్లాకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయుల వ్యాసాలు ఎంపిక కాగా, వారు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
33 జిల్లాల నుంచి 32మంది
సెమినార్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 33జిల్లాల నుంచి ఉపాధ్యాయులు సైన్స్ సంబంధిత అంశాలపై వ్యాసాలు సమర్పించారు. వీటి పరిశీలన అనంతరం 32మంది ఉపాధ్యాయుల వ్యాసాలను ఎంపిక చేసింది. ఇందులో జిల్లా నుంచి ముగ్గురు ఉండడం విశేషం. వేంసూరు జెడ్పీహెచ్‌ఎస్ ఉపాధ్యాయుడు ఆకూటి రాంబాబు, ఎర్రుపాలెం మండలం జమలాపురం జెడ్పీహెచ్‌ఎస్ ఉపాధ్యాయినికి బుద్ధ సోమలక్ష్మితో పాటు ఏన్కూరు మండలం బురదరాఘవాపురం జెడ్పీహెచ్‌ఎస్‌ఎస్ నుంచి సాగి సుజాత ఉన్నారు. వీరిని డీఈఓ చైతన్యజైనీ, జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి పెసర ప్రభాకర్‌రెడ్డి అభినందించారు.
సెమినార్‌కు సంబంధించి రాష్ట్ర విద్య శిక్షణ పరిశోధన మండలి ‘శాసీ్త్రయ దృక్పథం– విమర్శనాత్మక ఆలోచనను పెంపొందించ డం’ అంశాన్ని ఎంపిక చేసింది. అంతేకాక కుతూహలం, ప్రశ్నించేతత్వాన్ని ప్రోత్సహించడం, తార్కిక ఆలోచన, సాక్ష్యం ఆధారిత విశ్లేషణను పెంపొందించడం, సైన్స్
అభ్యసనలో అపోహలు తొలగించడం, శాసీ్త్రయ పద్ధతుల్లో నైతికత, విలువలు తదితర ఉప అంశాలు ఉండగా వీటి ఆధారంగా వ్యాసాలను ఆహ్వానించారు. వందలాది వ్యాసాలు అందగా కమిటీ పరిశీలించి 32మాత్రమే ఎంపిక చేసింది.


