సౌర ప్లాంట్ల ఏర్పాటులో వేగం | - | Sakshi
Sakshi News home page

సౌర ప్లాంట్ల ఏర్పాటులో వేగం

Feb 26 2026 8:35 AM | Updated on Feb 26 2026 8:35 AM

సౌర ప్లాంట్ల ఏర్పాటులో వేగం

సౌర ప్లాంట్ల ఏర్పాటులో వేగం

బోనకల్‌: సౌర విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటు పనుల్లో వేగం పెంచి నిర్దేశిత సమయానికి పూర్తి చేయాలని ఎన్పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి ఆదేశించారు. బోనకల్‌ మండలం చిరునోముల, బ్రాహ్మణపల్లి, కలకోట, ముష్టికుంట్లల్లో నిర్మిస్తున్న సబ్‌స్టేషన్లు, సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటు పనులను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ మండలంలోని 22గ్రామాలను మోడల్‌ సోలార్‌ పథకం కింద ఎంపిక చేసినందున ప్రతీ ఇంటికి రెండు కిలోవాట్లు, రైతులకు ఉపయోగపడేలా 7.5 కిలోవాట్ల ప్లాంట్లు ఏర్పాటుచేస్తున్నామని తెలిపారు. ఈ ప్లాంట్లతో వినియోగదారులకు బిల్లులు తగ్గడమే కాక పర్యావరణానికి మేలు జరుగుతుందని వెల్లడించారు.

మోడల్‌ సోలార్‌ గ్రామాల్లో సర్వే

ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో ఎంపిక చేసిన మోడల్‌ సోలార్‌ గ్రామాల్లో సర్వే నిర్వహించాలని ఎన్పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌రెడ్డి సూచించారు. ఖమ్మంలోని అధికారులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ బోనకల్‌ పూర్తి మండలంతో పాటు నేలకొండపల్లి మండలంలోని చెరువుమాదారం, రఘునాథపాలెం, ఏన్కూరు మండలంలోని శ్రీరాంగిరి, మధిర మండలంలోని సిరిపురంలో సర్వే ద్వారా సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటుకు అంచనాలు రూపొందించాలని తెలిపారు. సర్వే బాధ్యతలు 16 మంది సబ్‌ ఇంజనీర్లు నిర్వర్తించాలని సూచించారు. ఎన్పీడీసీఎల్‌ చీఫ్‌ ఇంజనీర్‌ వెంకటరమణ, ఖమ్మం ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి, రెడ్‌ కో ఉమ్మడి జిల్లా మేనేజర్‌ పొలిశెట్టి అజయ్‌కుమార్‌, అధికారులు భద్రుపవార్‌, శ్రీనివాసరావు, అజయ్‌, కిరణ్‌ చక్రవర్తి, వైవీ.ఆనంద్‌కుమార్‌, మనోహర్‌, సర్పంచ్‌లు పిల్లలమర్రి నాగేశ్వరరావు, అనుముల కళావతి, పైడిపల్లి అనిత పాల్గొన్నారు.

ఎన్పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement