ప్రథమం... ప్రశాంతం !
జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు బుధవారం
మొదలయ్యాయి. తొలిరోజు పరీక్ష ప్రశాంతంగా ముగియగా.. ఖమ్మం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల కేంద్రాన్ని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పరిశీలించారు. అన్ని కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఎండ దృష్ట్యా చల్లని తాగునీరు సరఫరా చేయాలని నిర్వాహకులకు సూచించారు. కాగా, తొలిరోజు ఇంటర్ మొదటి సంవత్సరం ద్వితీయ భాష పేపర్–1 పరీక్షకు జనరల్, ఒకేషనల్ కలిపి 18,258 మంది విద్యార్థులకు గాను 17,667 మంది హాజరయ్యారని డీఐఈఓ రవిబాబు వెల్లడించారు. కేంద్రాల వద్దకు విద్యార్థుల వెంట తల్లిదండ్రులు రాగా, తొలుత హాల్‌టికెట్లతో ఆలయాల్లో పూజలు చేయించారు. పలు కేంద్రాల్లో విద్యార్థులతో వాచ్‌లు, షూ కూడా అనుమతించకపోగా క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
– ఖమ్మం సహకారనగర్ / స్టాఫ్ ఫొటోగ్రాఫర్
తొలిరోజు పరీక్షకు 591మంది గైర్హాజరు


