రాష్ట్రస్థాయి నెట్‌బాల్ టోర్నీ ప్రారంభం
ఖమ్మం స్పోర్ట్స్: రాష్ట్రస్థాయి పాఠశాలల అండర్–14 నెట్‌బాల్ టోర్నమెంట్ శనివారం వీ.వీ.పాలెంలోని సెడార్ వ్యాలీలో పాఠశాలలో ప్రారంభమైంది. హార్వెస్ట్ విద్యాసంస్థల అధిపతి పి.రవిమారుత్, వీ.వీ.పాలెం సర్పంచ్ కాపా ఆదినారాయణ, జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి వై.రామారావు, నెట్‌బాల్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు సీహెచ్.దీప్తి ప్రారంభించిన ఈ టోర్నీలో పాత పది జిల్లాలకు చెందిన క్రీడాకారులు హాజరయ్యారు. మూడు రోజుల పాటు లీగ్ కం నాకౌట్ విధానంలో పోటీలు జరుగుతాయని టెక్నికల్ కమిటీ బాధ్యులు పీ.వీ. రమణ, బి.నాగయ్య తెలిపారు.


