అప్రమత్తత, క్రమశిక్షణతో విధులు
ఖమ్మంక్రైం: సీఎం రేవంత్‌రెడ్డి ఖమ్మంలో ఆదివారం పర్యటించనుండగా భద్రతా విధుల్లో పోలీసు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని సీపీ సునీల్‌దత్ ఆదేశించారు. ఖమ్మంలో పోలీసు ఉద్యోగులతో శనివారం సమావేశమైన ఆయన మాట్లాడుతూ ప్రతీ ఉద్యోగి అప్రమత్తంగా, క్రమశిక్షణతో వ్యవహరించాలని తెలిపారు. అనంతరం హెలీప్యాడ్, కాన్వాయ్, పార్కింగ్ స్థలాల వద్ద విధులపై సీపీ సూచనలు చేశారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ ప్రసాద్‌రావు, ఏసీపీలు వసుంధరయాదవ్, రమణమూర్తి, తిరుపతిరెడ్డి, సతీష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
పోలీసు కమిషనర్ సునీల్‌దత్


