రక్షణలో కమ్యూనిస్టులు
చారిత్రక ఘట్టంలో
భాగస్వాములు కావాలి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
కూనంనేని సాంబశివరావు
దేశ సంపద
ఖమ్మంమయూరిసెంటర్: భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ఖమ్మంలో ఆదివారం నిర్వహిస్తున్న సభ చరిత్రలో నిలిచిపోనుందని, ఈ చారిత్రక ఘట్టంలో ప్రజలు భాగస్వాములు కావాలని కొత్తగూడెం ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. ఖమ్మం ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల మైదానంలో జరిగే సభకు సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజాతో పాటు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తదితరులు హాజరుకానున్నారని తెలిపారు. ఖమ్మంలోని గిరిప్రసాద్ భవన్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో కూనంనేని మాట్లాడుతూ ఖమ్మం సభ కమ్యూనిస్టుల పురోగమనం, ప్రజా సమస్యల పరిష్కారానికి దోహదపడుతుందన్నారు. సంపూర్ణ స్వాతంత్య్రం నినాదం లక్ష్యంతో పోరాడిన ఏకై క పార్టీ కమ్యూనిస్టు పార్టీ మాత్రమే కాగా.. అధికారంలో ఉన్నా, లేకున్నా తమ నినాదాలే పాలకుల విధానాలుగా మారాయని, పోరాటాల కారణంగానే చట్టాలు అమలయ్యాయని తెలిపారు. జాతీయ ఉపాధి హామీ పథకం, అటవీ హక్కుల చట్టం, సమాచార హక్కు చట్టం కమ్యూనిస్టుల పోరాట ఫలితమేనన్నారు. దేశ సంపద రక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణను కమ్యూనిస్టులు బాధ్యతగా స్వీకరించారని.. లేకపోతే ఎల్‌ఐసీ, బ్యాంకులు, రైల్వేలు, కోల్ ఇండియా ఎప్పుడో ప్రైవేట్ శక్తుల పరమయ్యేవని తెలిపారు.
రెండో శతాబ్దంలోనూ ప్రజా పోరాటాలు
శతాబ్దకాలం పాటు పోరాటం సాగించిన సీపీఐ.. రెండో శతాబ్దంలోనూ ప్రజా పోరాటాలకు సిద్ధంగా ఉందని పార్టీ జాతీయ కార్యదర్శి ప్రకాష్‌బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 డిసెంబర్ 24 శతాబ్ది ఉత్సవాలు కాన్పూర్‌లో మొదలుకాగా, కమ్యూనిస్టు ఖిల్లా ఖమ్మంలో ముగియనున్నాయని చెప్పారు. ఈ సమావేశంలో జాతీయ సమితి సభ్యుడు, ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి దండి సురేష్, నాయకులు జమ్ముల జితేందర్‌రెడ్డి, యర్రా బాబు, ఎస్‌కే.జానీమియా, కొండపర్తి గోవిందరావు, సిద్దినేని కర్ణకుమార్, బిజి.క్లెమెంట్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కూనంనేని, హేమంతరావు తదితరులు ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల మైదానంలో సభాస్థలిని పరిశీలించి సూచనలు చేశారు.


