భూసార పరీక్షలతో మెరుగైన ఫలితం
తల్లాడ: ప్రతీ రైతు భూసార పరీక్షలు చేయించి నివేదికల ఆధారంగా పంటల సాగు చేయడంతో యాజమాన్య పద్ధతులు పాటిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని జిల్లా వ్యవసాయ శాఖాధికారి పుల్లయ్య తెలిపారు. తల్లాడ మండలం కుర్నవల్లిలోని రైతువేదికలో మంగళవారం నిర్వహించిన ‘రైతు నేస్తం’ వీడియో కాన్పరెన్స్‌లో ఆయన మాట్లాడారు. పంటు సాగుకు ముందే భూసార పరీక్ష చేయించి నివేదికల ఆధారంగా ముందుకు సాగితే మేలు జరుగుతుందని తెలిపారు. అనంతరం వ్యవసాయ శాస్త్ర వేత్తలు ఆయిల్‌పామ్ సాగుతో లాభాలను వివరించగా, భూసార ఆరోగ్య కార్డులను అందజేశారు. ఏడీఏలు వి.శ్రీనివాసరెడ్డి, కె.స్వరూపరాణి, ఏఓలు ఎండీ.తాజుద్దీన్, బాలప్రకాశ్, జీ.వీ.రామారావు, ఏఈఓలు పాల్గొన్నారు.


